ఏ-విటమిన్‌తో కేన్సర్‌కు చెక్‌

02-08-2019: ఆరోగ్యానికి ‘విటమిన్‌-ఏ’ చేసే మేలు అంతా ఇంతా కాదు! దీనివల్ల చర్మ కేన్సర్‌ సోకే ప్రమాదం కూడా తగ్గుతుందని కొత్తగా రుజువైంది. అమెరికాలో 1.25 లక్షల మందిపై అధ్యయనం చేసి ఈ విషయం గుర్తించారు. విటమిన్‌-ఏ అధికంగా ఉండే చిలగడదుంప, క్యారెట్‌, బ్రకోలీ, తోటకూర, పాల పదార్థాలు, చేపలు అధికంగా తిన్న వారికి చర్మ కేన్సర్‌ సోకే ప్రమాదం 15 శాతం తక్కువని తేల్చారు.