పిత్తాశయంలో రాళ్లకు కాఫీతో చెక్‌!

06-09-2019: కాఫీ, టీ తాగితే మంచిది కాదని భావిస్తుంటారు చాలామంది. కానీ, టీ సంగతి ఎలా ఉన్నా.. కాఫీ తాగితే పిత్తాశయంలో రాళ్లు వచ్చే అవకాశం చాలా తక్కువని చెబుతున్నారు పరిశోధకులు. రోజుకు ఆరు కప్పుల కాఫీ తాగేవారిలో.. పిత్తాశయంలో రాళ్లు వచ్చే ముప్పు 23 శాతం తక్కువగా ఉందని వెల్లడించారు. దీని కోసం 1.04 లక్షల మందిపై డెన్మార్క్‌లోని కోపెన్‌హగెన్‌ పరిశోధకులు అధ్యయనం చేశారు. కాఫీ తాగని వారిలో పిత్తాశయ రాళ్లు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. రోజుకు ఒక్క కప్పు కాఫీ ఎక్కువగా తాగితే మూడు శాతం ముప్పు తగ్గుతోందని వెల్లడించారు.