చెవి చక్కిలిగింతతో వృద్ధాప్యానికి చెక్‌!

31-07-2019:  వయసు 55 పైబడిన వారిలో ఇయర్‌ టికిల్‌ థెరపీ (చెవి చక్కిలిగింత చికిత్స) ఎంతో మేలు చేస్తుందని బ్రిటన్‌లోని లీడ్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. తక్కువ మొత్తంలో విద్యుత్‌ ప్రసరింపజేసి చెవిని టికిల్‌ చేస్తే నాడీ వ్యవస్థ సమతుల్యంగా పనిచేస్తుందని, వారిలో వృద్ధాప్యం వచ్చే అవకాశం ఆలస్యం అవుతుందని వారు పేర్కొన్నారు. ఇలా రెండు వారాలపాటు రోజూ ఈ చికిత్స అందిస్తే వారి ఆరోగ్యం కూడా మెరుగవుతుందని, మానసికంగా ధృఢంగా ఉంటారని, మంచి నిద్ర పడుతుందని వెల్లడించారు.