జాగింగ్‌తో స్థూలకాయానికి చెక్‌!

03-08-2019: మీ కుటుంబంలో ఎవరికైనా స్థూలకాయం ఉంటే తస్మాత్‌ జాగ్రత్త! ఎందుకంటే ఊబకాయం జన్యుపరంగా సంక్రమించే ప్రమాదం ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాని బారిన పడకుండా ఉండేందుకు రోజూ జాగింగ్‌ చేయడం మంచిదని వారు పేర్కొన్నారు. 30 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 18 వేలమందిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని వెల్లడించారు. అధ్యయనంలో పాల్గొన్న వారి బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ), శరీరంలో కొవ్వు శాతం, రక్త నమూనాల ద్వారా జన్యు సమాచారాన్ని పరిశోధకులు సేకరించారు. రోజూ జాగింగ్‌ చేసే వారి బీఎంఐ ఆరోగ్యకరంగా ఉందని ఈ సందర్భంగా వారు గుర్తించారు.