పీచు పదార్థాలతో ఊపిరితిత్తుల కేన్సర్‌కు చెక్‌

27-10-2019: పీచు పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. జీవక్రియలో మెరుగుదల దగ్గర నుంచి, గుండె జబ్బులు నయం కావడం వరకు వైద్యులు వీటిని తీసుకోవాలని సూచిస్తారు. పీచుపదార్థాలు తినేవారిలో ఊపిరితిత్తుల కేన్సర్‌ వచ్చే అవకాశం చాలా తక్కువ అని తాజా అధ్యయనంలో తేలింది. మిగతావారితో పోల్చితే వీరిలో ఈ ప్రమాదం 33ు తక్కువ అని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 14 లక్షల మందిపై అధ్యయనం నిర్వహించి ఈ వివరాలను వెల్లడించారు.