కలివిడిగా ఉంటే చిత్తవైకల్యానికి చెక్‌!

05-08-2019: వయసుపైబడే కొద్దీ వృద్ధుల్లో కనిపించే ప్రధానమైన సమస్య జ్ఞాపకశక్తి, ఆలోచనశక్తి తగ్గిపోవడం. వైద్యపరిభాషలో చిత్తవైకల్యం (డిమెన్షియా)గా చెప్పుకునే ఈ వ్యాధికి.. స్నేహితులు, బంధువులతో కలివిడిగా గడపడమే చక్కని మందు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 50 ఏళ్ల వయసు దాటినవారు సమాజంతో కలివిడిగా ఉంటే భవిష్యత్తులో వారికి చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని వారు తాజా అధ్యయనంలో గుర్తించారు. ‘ప్లోస్‌ మెడిసిన్‌’ అనే జర్నల్‌లో ఈ వివరాలను ప్రచురించారు. పరిశోధనల్లో భాగంగా 10,228 మందిని వారు పరిశీలించారు. ఈ క్రమంలో 50-60 ఏళ్ల వయసులో సామాజికంగా చురుకుగా ఉన్న వారికి చిత్తవైకల్యం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్టు వారు గుర్తించారు.