బాల్యంలో ఇన్‌ఫెక్షన్లు లేకుంటే కేన్సర్‌ ముప్పు!

09-07-2019: అంటువ్యాధుల బారిన పడకుండా పెరిగిన వారికి బాల్యంలోనే కేన్సర్‌ (లుకేమియా) వచ్చే ప్రమాదం ఎక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వాస్తవానికి ఏదాది వయసులోపే అంటువ్యాధుల బారిన పడే చిన్నారులకు రోగనిరోధక శక్తి మరింత బలోపేతం అవుతుంది. తద్వారా భవిష్యత్తులో వచ్చే జబ్బులను తట్టుకునేలా వారి శరీరం తయారవుతుంది. సుకుమారంగా పెరిగిన చిన్నారుల్లో లుకేమియా వచ్చే అవకాశాలు ఎక్కువని పరిశోధకులు తెలిపారు.