వ్యాయామంతో కేన్సర్‌ అదుపు

18-10-2019: నిరంతర వ్యాయామం వల్ల ఊబకాయం, గుండెజబ్బులే కాదు కేన్సర్‌ కూడా అదుపులో ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వ్యాయామం కేన్సర్‌ను నిరోధిస్తుందన్నారు. కేన్సర్‌ రోగులకు ఔషధంగా పనిచేస్తుందని చెప్పారు. వారి జీవితకాలాన్ని పెంచడంలో దోహదపడుతుందని తెలిపారు. నిపుణుల సలహాల మేరకు రోగులు తమకు అనువైన వ్యాయామం చేయాలని సూచించారు. వ్యాయామం వల్ల కేన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెప్పారు.