హార్మోన్‌ చికిత్సతో రొమ్ము కేన్సర్‌ ముప్పు!

31-08-2019: మోనోపాజ్‌ దశలో కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం తీసుకునే హార్మోన్‌ చికిత్స రొమ్ము కేన్సర్‌కు దారితీస్తుందని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. హార్మోన్‌ చికిత్స ఆపేసిన పదేళ్ల తర్వాత కూడా కేన్సర్‌ వచ్చే ప్రమాదం పెరిగినట్టు వారు పేర్కొన్నారు. అధ్యయనంలో భాగంగా 50 నుంచి 69 ఏళ్ల మధ్య వయసులో హార్మోన్‌ చికిత్స తీసుకోని మహిళలకు రొమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశం 6.3 శాతం ఉన్నట్టు తేలితే.. హార్మోన్‌ చికిత్స తీసుకున్న మహిళలకు ఈ ప్రమాదం 7.7 శాతం ఉన్నట్టు గుర్తించారు.