బీపీ మాత్రలు ఏ సమయంలో వేసుకుంటే మంచిది..

24-10-2019: బీపీ ఉన్నవారు సాధారణంగా ఉదయం లేవగానే మందులు వేసుకొంటారు. డాక్టర్లు కూడా అలాగే చెప్తారు. అయితే స్పెయిన్‌కు చెందిన శాస్త్రవేత్తల పరిశీలనలో మాత్రం ఈ మాత్రలను రాత్రి నిద్రపోయే ముందు వేసుకొంటే అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయని తేలింది. నిద్రపోయే ముందు మాత్రలు వేసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉండటమే కాక గుండెపోటు లాంటి తీవ్రమైన వ్యాధులకు గురయ్యే ప్రమాదం సగానికి తగ్గిందని శాస్త్రవేత్తలు తెలిపారు. 19వేల మందిపై సగటున 6 సంవత్సరాల పాటు పరిశోధనలు నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు.