ఒత్తిడికి చెక్‌ పెట్టే యాప్‌

ఆంధ్రజ్యోతి, 07/07/15: తల్లిదండ్రుల ఒత్తిడిని తగ్గించే యాప్‌ను ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ యాప్‌కున్న సెన్సర్ల ద్వారా ఒత్తిడిని గుర్తించడమే కాదు దానికి చెక్‌ పెట్టొచ్చు కూడా. తల్లిదండ్రులకు ఈ యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు ఏం చేయాలో కూడా ఈ యాప్‌ సూచిస్తుంది.  ‘మైక్రోసాఫ్ట్‌ రీసెర్చ్‌’, ‘యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా’ లకు చెందిన శాస్త్రవేత్తలు ఈ యాప్‌ను రూపొందించారు. పిల్లలతో వాగ్వాదాలు చేసేటప్పుడు తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఉద్వేగాలకు లోనవుతుంటారు . వాటిని తగ్గించే వ్యూహాలను సైతం ఈ యాప్‌లో డిజైన్‌ చేశారు. దీనికి ‘పేరెంట్‌ గార్డియన్‌’ అని పేరు పెట్టడమే కాదు అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపరేక్టివ్‌ డిజార్డర్‌ (ఎడిహెచ్‌డి) ఉన్న పిల్లల తల్లిదండ్రుల మీద ప్రయోగించారు కూడా. ‘పేరెంట్‌ గార్డియన్‌’ అనే ఈ యాప్‌ తల్లిదండ్రుల్లోని ఒత్తిడిని గుర్తిస్తుంది. వాటికి తగ్గట్టు ఎలాంటి ‘ఇంటర్‌వెన్షన్స్‌’ అవసరమో తెలుపుతుంది. ఈ సిస్టమ్‌లో సెన్సర్లు కూడా ఉంటాయి. తల్లిదండ్రుల ప్రవర్తనను అనుసరించి ‘ఇంటర్‌వెన్షన్‌’ పద్ధతులు ఉంటాయి. ఇలా చేయడం ద్వారా ఎడిహెచ్‌డి పిల్లులున్న తల్లిదండ్రుల అవసరాలనే కాదు వారి పిల్లల అవసరాలను కూడా ఈ యాప్‌ తీరుస్తుంది. ఈ థెరపీ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలను డీల్‌ చేయడంలో మంచి నేర్పరులుగా తయారవుతారని దీని రూపకర్తలు అంటున్నారు. ఈ యాప్‌ సహాయంతో తమని తాము నియంత్రించుకోవడంతోపాటు తమని గురించిన అవగాహన సైతం పిల్లల్లో పెరుగుతుంది. ఫలితంగా తల్లిదండ్రుల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ యాప్‌ని తయారుచేయడానికి మూడు నెలలు పట్టింది. ఇందులో భాగంగా పదిమంది తల్లిదండ్రులను ఒత్తిడి ఎక్కువగా ఉండే వేళలో అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల టైములో వారి ప్రవర్తనను పరిశీలించారు. ఆ టైములో పిల్లల చేత హోంవర్కు చేయించడంతోపాటు డిన్నర్‌ సిద్ధం చేయడం వంటి ఎన్నో పనులు ఉంటాయి. అదే సమయంలో పిల్లలు చేస్తున్న ఇతర కార్యక్రమాలను కూడా వీళ్లు గమనిస్తుంటారు. ఈ ‘పేరెంట్‌ గార్డియన్‌’లో ఒత్తిడిని పసిగట్టే సెన్సర్లు ఉంటాయి. ఇందులో ఫోను కూడా ఉంటుంది. ఇది తల్లిదండ్రులు అనుసరించాల్సిన వ్యూహాల గురించి తెలియజేస్తుంది. అంతేకాదు సెన్సర్‌ నుంచి బ్యాకెండ్‌ సర్వర్‌కు డేటాను పంపుతుంది. అక్కడ సెన్సర్‌ డేటాను పరిశీలించి ఏ ఏ సమయాల్లో తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారో గ్రహిస్తుంది. ఎలాంటి ఇంటర్‌వెన్షన్స్‌ చేపట్టాలో సూచిస్తుంది. అమ్మలూ...నాన్నలు ... మరికెందుకు ఆలస్యం ఆ యాప్‌ని ఉపయోగించుకోండి. ఒత్తిడి లేకుండా పిల్లలతో హాయిగా కలిసిమెలిసి జీవించండి... ఇ5ఇ్‌