రక్తపరీక్షతో అల్జీమర్‌ గుర్తింపు

04-08-2019: అల్జీమర్‌ వ్యాధి గుర్తింపులో భారీ ముందడుగు పడింది. ఇప్పటి వరకు మెదడు స్కానింగ్‌ ద్వారా మాత్రమే బయటపడుతున్న అల్జీమర్‌ లక్షణాలను కేవలం రక్త పరీక్ష ద్వారా వైద్యులు గుర్తించారు. ఈ పరీక్షలు విజయవంతం అయ్యాయని, రక్త పరీక్షలో అల్జీమర్‌ను 94% కచ్చితత్వంతో గుర్తించామని వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ న్యూరాలజీ ప్రొఫెసర్‌ ర్యాండల్‌ జె. బేట్‌మన్‌ వెల్లడించారు. రక్తంలోని అమిలాయిడ్‌(ఏబీటా)42, (ఏబీటా)40ల నిష్పత్తిని సంయోగం చేయడం ద్వారా అల్జీమర్‌ను 94% గుర్తించగలిగినట్టు వివరించారు. అల్జీమర్‌ గుర్తింపులో ఇది అత్యంత తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో కూడినది వివరించారు.