అరగంటలోనే యాక్టివ్‌ టీబీ నిర్ధారణ!

25-10-2019: యాక్టివ్‌ టీబీ ముందస్తు నిర్ధారణ కోసం అమెరికా శాస్త్రవేత్తలు అత్యంత చౌకయిన, వేగవంతమైన రక్త పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ విధానం ద్వారా యాక్టివ్‌ టీబీ వచ్చే అవకాశాలను ముందుగానే అత్యంత కచ్చితంగా తెలుసుకోవచ్చని వారు తెలిపారు. తద్వారా సరైన చికిత్స అందించి వ్యాధిని నివారించవచ్చన్నారు. దీనికోసం వారు రక్తం నమూనాలోని నాలుగు ప్రోటీన్లు, రోగ నిరోధక శక్తిని బట్టి టీబీ వచ్చే అవకాశాలను అంచనా వేశారు. వివిధ దేశాలకు చెందిన ప్రజల 317 రక్త నమూనాలపై పరిశోధనలు జరిపి ఈ వివరాలను వెల్లడించారు. కేవలం అరగంటలో ముగిసే ఈ పరీక్ష ఖర్చు కేవలం రూ. 150 మాత్రమేనని తెలిపారు.