శిరోజాల సంరక్షణకు ఆధునిక థెరపీలు

ఆంధ్రజ్యోతి(18-07-13): శిరోజాలు అందానికే కాదు, ఆత్మవిశ్వాసానికీ ప్రతీక లు. మానవ జీవితంలో అంత ప్రాధాన్యత గల శిరోజాలు ఒక్కొక్కటే రాలిపోతూ చివరికి బట్టతల మిగిలిపోతే ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుంది? ఎందుకిలా అంటే కారణాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఆహార లోపాలు, వాతావరణ కాలుష్యాలు,  జన్యుపరమైన లోపాలు ఇంకా మరెన్నో కలిసి జుట్టురాలిపోవడానికి కారణమవుతున్నాయి. దీనికి తోడు కొన్ని ఇతర కారణాల వల్ల జత్తు తెల్లబడటం కూడా ఒక పెద్ద సమస్యగానే ఉంది. ఈ రెండు సమస్యలనూ అధిగమింపచేసే వైద్యాలు  నేడు సిద్ధమైపోయాయి. అయితే ఈ కొత్త విధానాలు ఒకప్పటిలా అంత కష్టతరంగా కూడా లేవు. ఈ ఆధునిక చికిత్సలతో అత్యంత అవలీలగానే అధిగమించవచ్చునంటున్నారు ప్రముఖ  కాస్మెటాలజిస్టు డాక్టర్‌ రజిని.

శిరోజాలను కాపాడుకునేందుకు  పైపై ప్రయత్నాలు ఎన్నిచేసినా కొందరిలో  తలలోని  కొన్ని సమస్యలతో అవి రాలిపోతూనే ఉంటాయి. ఇది బాహ్యమైన సమస్యగానే  కనిపించినా ఒకదశలో ఇది మానసిక సమస్యగా కూడా పరిణమిస్తుంది. రూపానికి తలమానికంగా ఉండే శిరోజాలు రాలిపోవడంతో ఏదో కురూపం వచ్చి చేరినట్లు చాలా మంది విపరీతంగా ఆవేదనకు గురవుతారు. ఈ సమస్యకు ఒక శాశ్వతమైన విరుగుడుగా శాస్త్రవేత్తలు ఒక  కొత్త విధానాన్ని రూపొందించారు.  జుట్టు రాలిపోయిన వారినుంచి సేకరించిన రక్తంతో కూడిన ఒక ద్రావణాన్ని జుట్టు రాలిపోయిన చోట ఎక్కించడమే ఆ విధానం.  ఈ ద్రావణం చర్మం కింత కొత్త మూలకణాలను ప్రేరేపించడం ద్వారా వెంట్రుకలు తిరిగి వృద్ధి చెందేలా చేస్తుంది. నిజానికి ముఖం, చేతులపై వృధ్ధాప్య ఛాయలను తొలగించడానికి రక్తం నుంచి సేకరించిన ప్లేటెలెట్లను ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా ఒక అంతర్జాతీయ కేశ పరిశోధనా ఫౌండేషన్‌, ఇటలీలోని బ్రెస్కియా యూనివ ర్సిటీ, ఇజ్రాయెల్‌లోని హీబ్రూ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కూడా ఇదే విధానాన్ని ఉపయోగించారు.  వీరు బట్టతల సమస్య ఉన్న 45 మంది తలలో సగభాగంపై ఇంజెక్షన్‌ చేశారు. ఇంజెక్షన్లు తీసుకున్న వారిలో వెంట్రుకలు ఘననీయంగా మొలిచినట్లుగా వారు గుర్తించారు. ఈ విధానం వల్ల జుట్టు రాలిన వారికి ఏ విధమైన దుష్ప్రభావాలూ ఉండవు. బట్టతల సమస్యే కాకుండా జుట్టుకు సంబంధించిన చుండ్రు పేనుకొరుకుడు, వెంట్రుకలు రాలిపోవడం వంటి  సమస్యలను సమూలంగా నివారించవచ్చు. 
జుట్టుకు రంగుతో పనిలేదు.
తెల్ల వెంట్రుకలు మనిషిని ఒక నిర్జీవ   భావానకు గురిచేస్తాయి. అందుకే చాలా మంది జుట్టుకు రంగు వేసుకోవడానికి సిద్ధమవుతారు. కాకపోతే నిరంతరం అలా రంగు వేసుకోవడంలో ఎంతో  శ్రమ, కాలయాపన అవుతూ ఉంటుంది. ఈ సమస్యలన్నీ తొలగిపోవడానికి  త్వరలోనే ఒక విధానం అందుబాటులోకి రాబోతోంది. కొద్దిపాటి ఈ  వైద్య చికిత్సలతో జుట్టు తిరిగి పూర్వ వర్ణంలోకి వచ్చేసే అవకాశం ఉంది. జర్మన్‌, బ్రిటన్‌ శాస్త్రవేత్తలు దీన్ని రూపొందిస్తున్నారు. జుట్టు తెల్లబారడానికి గల కారణాలను అన్వేషించే క్రమంలో కొన్ని కొత్త నిజాలు బయటపడ్డాయి. విషయం ఏమిటంటే,  తెల్లజుట్టు వస్తున్న  వారి వెంట్రుక కుదురులో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌  పేరుకుపోతోందని, ఫలితంగా  ఆక్సిడేటివ్‌ ఒత్తిడి పెరుతున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ క్రమంలో వెంట్రుక లోపలి నుంచి తనను తాను బ్లీచ్‌ చేసుకుంటోంది.  అయితే హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ పేరుకుపోవడాన్ని  నియంత్రించేందుకు పీసీ-కేయూఎస్‌ అనే మార్పిడి చేసిన సూడోకెటలేజ్‌ను ఉపయోగించవచ్చని  శాస్త్త్రవేత్తలు కనుగొన్నారు.  దీనివల్ల జుట్టు తిరిగి పూర్వ వర్ణాన్ని సంతరించుకుంటుందని వారు తెలుసుకున్నారు. 
డెర్మారోలర్‌ థెరపీ
ఈ వినూత్న విధానంలో శరీరంలోకి ఏ విధమైన  ఇంజెక్షన్లనూ ఇవ్వడం జరగదు. కేవలం చర్మంలోని మధ్యపొరను ప్రేరేపించడం ద్వారా  శరీరంలోని కణజాలాన్ని ఉత్తేజపరచడం ఈ చికిత్సలోని  కీలక అంశం. డెర్మారోలర్‌ థెరపీ ద్వారా  స్కార్‌ రిమూవల్‌ అండ్‌ సింపుల్‌ రిమూవల్‌,  వైటనింగ్‌ రిజువనేషన్‌,  మంగు, పులిపిర్లు, పొట్టమీద చారలు,పోయి చర్మం గ్యారెంటీగా అందంగా, ఆకర్షనీయంగా తయారవుతుంది. ఆ వ్యక్తి  ముఖం పరిస్థితిని బట్టి, వారానికి ఒకసారి గానీ, రెండు వారాలకు ఒకసారి గానీ  ఈ చికిత్స ఇవ్వబడుతుంది. థెరపీ మొదలైన 4 నుంచి 6 వారాల లోపు చర్మం ముడతలు కళావిహీనత తగ్గిపోయి ఆకర్షనీయంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.  గమనించవలసింది ఒక్కటే శరీరంలో వచ్చే ప్రతికూల మార్పులకు ఒక ప్పటిలా దురదృష్టం అనుకుంటూ జీవితమంతా కుంగిపోతూ గ డపాల్సిన అవసరం ఇప్పుడు  ఏమాత్రం లేదు. ఆధునిక వైద్యాలను ఆశ్రయించాలే గానీ, ఆ సమస్యలన్నీ పటాపంచలవుతాయి. దట్టమైన జుట్టు మీ సొంతమవుతుంది. దిగులూ, ఆవేదన పటాపంచలై నల్లబంగారంలా జుట్టు  తళతళా  మెరుస్తూ మీలో ఆనందాన్ని నింపుతుంది. కొండంత ఆత్మవిశ్వాసాన్ని మీ హృదయంలో నింపుతుంది.
 
 
డాక్టర్‌ ఆర్‌ రజిని
కాస్మెటాలజిస్ట్‌
బ్యూటిఫుల్‌ లైఫ్‌ స్కిన్‌ - హెయిర్‌ క్లినిక్‌
కూకట్‌పల్లి, హౌజింగ్‌ బోర్డ్‌, రోడ్‌ నెం.1 హైదరాబాద్‌
ఫోన్‌: 040-23059094
9393817038, 9348222242