పేను కొరుకుడుకు విరుగుడు

ఆంధ్రజ్యోతి: పేను కొరుకుడు అంటే ఉన్నట్టుండి తలమీద వెంట్రుకలు కొద్ది పాటి ప్రాంతంలో రాలిపోవడం మరియు చర్మం కనిపిస్తూ ఉండటం. ఇది అలర్జీ కారణంగా జరుగుతుందని వైద్యుల అభిప్రాయం. ఈ అలర్జీ తగ్గిపోగానే మళ్లీ తిరిగి వెంట్రుకలు వస్తాయి. దీనినే పేను కొరుకుడు అంటారు. కొందరు బట్టతల మాదిరిగా అవుతుందేమోనని అపోహ పడుతుంటారు.

నిర్ణీత స్థలంలో గుండ్రంగా వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నగా మారటాన్ని పేను కొరుకుడు అంటారు. నిజానికి అది పేను కొరకడం వల్ల వచ్చింది కాదు. జనానికి అర్థం కావడానికి అలా అంటుంటారు. దీన్ని వైద్య పరిభాషలో అయితే ‘ఆలోపేషియా ఏరియేటా’ అని పిలుస్తారు. ప్రపంచ జనాభాలో 2 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.

కారణాలు..
 ఇది ఒక ‘ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌’ అనగా వెంట్రుకలకు వ్యతిరేకంగా తనలోనే ఆంటీబాడీస్‌ తయారయ్యి అక్కడక్కడ వెంట్రుకలు లేకుండా చేస్తుంది.
 మానసిక ఆందోళన వల్ల కూడా ఇది ఏర్పడవచ్చు.
 థైరాయిడ్‌, డయాబెటిక్‌, బిపి వంటి సమస్యలు ఉన్నవాళ్లకు ఇది వచ్చే అవకాశం ఉంది. ఈ జబ్బు ఉన్నవాళ్లలో 20 శాతం మందికి గోళ్ల మీద గీతలు, గుంటలు ఏర్పడవచ్చు. 
 ఈ జబ్బుకు స్త్రీ, పురుషులు అని తేడా ఉండదు, వయసుతో నిమిత్తం ఉండదు. చిన్నపిల్లల్లో కూడా ఈ జబ్బు కనిపించవచ్చు. 20 ఏళ్ల వయసున్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
 వంశపారంపర్యంగా కూడా ఇది సంక్రమించవచ్చు. కుటుంబంలో ఒకరికి ఉంటే మరొకరికి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది అంటువ్యాధి కాదు. అరవై సంవత్సరాలు దాటిన వారిలో ఈ సమస్య కనిపించదు. ఇది తలలోకానీ, గడ్డంలో కానీ, మీసాలలో కానీ రావొచ్చు. దీన్ని ఆలోపేషియా యూనివర్సాలిస్‌ అంటారు.
హోమియో చికిత్స..
ఇష్టానుసారంగా మందులు వాడటం వల్ల జబ్బు తగ్గకపోగా, సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఏ చికిత్సా విధానమైనా, చాలా ఓర్పుతో తగ్గేవరకు డాక్టర్‌ పర్యవేక్షణలో చికిత్స సాగాలి. వీటికి సంబంధించి పాజిటివ్‌ హోమియోపతిలో చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. వ్యాధి నయం కావడంతో పాటు వెంట్రుకలు కోల్పోయిన ప్రాంతంలో మళ్లీ జుట్టు రావడం గమనార్హం. చాలా అద్భుతమైన మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఫలితాలు అందరికీ ఒకేలా ఉండవు. కొందరికి చాలా కొద్ది కాలంలోనే అనూహ్యమైన ఫలితాలు కనిపిస్తాయి. కొందరిలో కొంత వ్యవధి పట్టవచ్చు. ఓపికగా వాడినట్లయితే ఫలితాలు వందకు వంద శాతం చూడవచ్చు. ఈ మందులకు సంబంధించి ఎలాంటి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఏ మాత్రం ఉండవు.
 
డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌, 
పాజిటివ్‌ హోమియోపతి
పాజిటివ్‌ హోమియోపతి, ఫోన్‌:9246199922
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు
డాక్టర్‌తో మాట్లాడాలంటే ఫోన్‌:92461 66333