ఒత్తైన జుట్టు కోసం..

ఆంధ్రజ్యోతి(04/07/15): కొందరికి మాటిమాటికీ జుట్టు రాలిపోతుంటుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల జుట్టు రాలడం ఒక ఎత్తయితే.. ఆ జుట్టు రాలిపోతుందని చాలామంది కృంగిపోతుంటారు. నిండైన జుట్టు కోసం సెలూన్స్‌, స్పాల వెంటా తిరుగుతుంటారు. ఇలా కాకుండా అందుబాటులో ఉండే హోమ్‌ రెమెడీస్‌తో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అంటున్నారు పరిశోధకులు
కలబంద
జుట్టు పెరుగుదలకి కలబంద బాగా ఉపయోగపడుతుంది. ఈ చక్కని హోమ్‌ రెమిడీతో మంచి ఫలితాలు పొందవచ్చు. అలొవిరా జుట్టులోని డాండ్ర్‌ఫని తగ్గిస్తుంది. అలొవిరా రసాన్ని జుట్టుకి అప్లై చేస్తే ఇది యాంటీ ఫంగల్‌, యాంటీ బాక్టీరియాగా కూడా పని చేస్తుంది. ప్రతిరోజూ అలొవిరా రసాన్ని తలకి పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 
కొబ్బరినూనె
జుట్టు బాగా పెరగడానికి కొబ్బరినూనె సహాయపడుతుంది. గోరు వెచ్చగా చేసిన కొబ్బరి నూనెని తలంతా అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. ఆ స్థలంలో జుట్టు పెరుగుదల కనిపిస్తుంది. ఈ కొబ్బరి నూనె తలకి   అప్లై చేయటం వల్ల బ్లడ్‌ సర్క్యులేషన్‌ కూడా పెరుగుతుంది. వీటితో పాటు కురుల పెరుగుదలకి క్రమం తప్పని డైట్‌ పాటించాలి. ముఖ్యంగా ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే కోడిగుడ్లు, చికెన్‌, కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు తినాలి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.