జుట్టుకు రంగు వేస్తున్నారా..!

ఆంధ్రజ్యోతి(30/07/15):జుట్టు ఇలా నెరిసిందో లేదో.. అలా రంగు వేసేస్తున్నారు. రసాయనాలు కలిసిన రంగుల గాఢతను జుట్టు భరిస్తుందో లేదోనని ఆలోచించడం లేదు. అయితే ఒక్కసారి జుట్టుకు రంగు వేస్తే చాలు.. అందులోని రసాయనాలు జుట్టు సహజత్వాన్ని దెబ్బతీస్తాయనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. అయినా రంగు వేయక తప్పదని మీరు భావిస్తే.. ఎక్స్‌పర్ట్‌ సలహా తీసుకుని ముందడుగు వేయండి. కలర్స్‌ వాడుతున్నప్పుడు వెంట్రుకల ఆరోగ్యాన్నీ ఓ కంట కనిపెట్టాలి. అలోవెరా, గోరింటాకు, ఉసిరి, మందార ఆకులు, పువ్వులు, గుంటగలగర ఆకుల వంటి ప్రకృతి సిద్ధమైన వనరులను నేరుగానో, నూనె ద్వారానో జుట్టుకు పట్టించడం మంచిది.
హెయిర్‌ కలర్స్‌ ఎంచుకునేటప్పుడు రసాయనాలు ఉన్నవి కాకుండా.. నేచురల్‌ ప్రొడక్ట్స్‌నే వాడాలి. ఎలాంటి హెయిర్‌ డై అయినా వారానికి ఒకసారి వేస్తూ పోతే వెంట్రుకలు, కుదుళ్లు బలహీనం అవుతాయి. మూడునాలుగు వారాలకోసారి వీటిని అప్లై చేసుకోవడం మంచిది.