జుట్టు రాలకుండా

ఆంధ్రజ్యోతి(24/07/15): జుట్టు అధికంగా రాలితే మానసికంగా కృంగిపోతుంటారు. అలా కృంగిపోవటం వల్ల కూడా జుట్టు ఇంకా రాలే శాతం అధికమవుతుందని మర్చిపోరాదు. జుట్టు అధికంగా రాలే వారు తేలికపాటి టిప్స్‌తో పాటు కొన్ని హోమ్‌ రెమిడీ్‌సను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు. ఆ టిప్స్‌ తెల్సుకుందాం.

అధికంగా జుట్టు రాలిపోతుంటే మొదట ఓ రెండు విషయాలు పాటించాలి. ఒకటి పొడి జుట్టును పలుమార్లు  దువ్వడం చేయకండి. దీని వల్ల జుట్టు రాలిపోయే అవకాశాలెక్కువ. ఇక రెండోది రోజూ ఉదయాన్నే తల మాడుని మసాజ్‌ చేయించుకోవాలి. దీని వల్ల పుర్రెమీద చర్మం ఉత్తేజితమవుతుంది. తద్వారా జుట్టు మూలాలు ఆరంభమయ్యే చోట ఉండే చిన్నపాటి రంధ్రాలు చురుకై ఆశించిన మంచి ఫలితం కలుగుతుంది.

ఆలివ్‌ లేదా కొబ్బరి నూనెను తీసుకుని దానిలోకి రెండు చుక్కల నిమ్మరసం వేయాలి. దీన్ని మిక్స్‌ చేసి తలకి అప్లై చేయాలి. ఒక గంట పాటు ఆరనివ్వాలి. తర్వాత షాంపూతో తలని శుభ్రపరుచుకోవాలి.

ఒక పాత్రలో నీటిని కాచి దాంట్లో కొన్ని చుక్కల ఆలివ్‌ నూనె వేయాలి. ఒక టవల్‌ని ఆ నీటిలో ముంచి తలని కవర్‌ చేసేట్లు చుట్టేయాలి. ఇది న్యాచురల్‌ స్పా అనుకోవచ్చు.

వెల్లుల్లి, అల్లం లేదా ఉల్లి రసాన్ని రాత్రి పడుకునేముందు తలకి బాగా పట్టించుకోవాలి. ఉదయం నిద్ర లేస్తూనే జుట్టును శుభ్రం చేసుకోవాలి. చక్కని ఫలితం కలుగుతుంది.