కురులు దృఢంగా మారాలంటే...

10-09-2019: జుట్టు పలచగా, బలహీనంగా ఉందా! అయితే రోజూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే నిండైన, బలమైన కురులు మీ సొంతమవుతాయి. అదేలాగంటే...
షాంపూ: వెంట్రుకలకు హాని చేయని షాంపూనే ఉపయోగించాలి. ఇలాచేస్తే వెంట్రుకల దృఢత్వం పెరుగుతుంది.
కండీషనర్‌: కేశాలకు కండీషనింగ్‌ చేయాలనుకున్నప్పుడు కొసలకు మాత్రమే కండీషనర్‌ రుద్దుకోవాలి. కురుల చివరన హెయిర్‌ సీరం రుద్దుకుంటే వెంట్రుకలు చిక్కుపడవు.
బ్లో డ్రైయర్‌: తలస్నానం చేశాక శిరోజాలను డ్రైయర్‌తో ఆరబెట్టుకోవాలి. వెంట్రుకలు పూర్తిగా ఆరిన తర్వాతే జడ వేసుకోవాలి.
బ్యాక్‌ కోంబింగ్‌: జుట్టు నిండుగా పెరిగేందుకు బ్యాంక్‌ కోంబింగ్‌ తోడ్పడుతుంది. కొసల నుంచి మాడు వరకు దువ్వడం వల్ల వెంట్రుకలు బలంగా మారతాయి. జుట్టు రాలిపోవడం తగ్గుతుంది.