కురుల జిడ్డు పోవాలంటే..!

25-04-2019: వేసవిలో ఇబ్బందిపెట్టే సమస్య జిడ్డు వెంట్రుకలు. జిడ్డు శరీరతత్వం ఉన్నవాళ్ల వెంట్రుకలు ఎండ వేడి తగలగానే దగ్గరికి అతుక్కుపోతాయి. జిడ్డు పెరిగి, చెమటతో కలిసి పలు రకాల సమస్యలూ తలెత్తుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే, వెంట్రుకల్లో ఏర్పడే జిడ్డును ప్రకృతిసిద్ధమైన చికిత్సతో వదిలించుకోవాలి. ఇందుకోసం...
కుంకుడుకాయల రసంలో, కలబంద గుజ్జు, నిమ్మరసం కలిపి, ఈ మిశ్రమాన్ని సీసాలో నింపి నిల్వ చేసుకోవాలి. దీంతో క్రమం తప్పకుండా కనీసం వారం రోజులపాటు తలస్నానం చేస్తే వెంట్రుకల జిడ్డు వదులుతుంది. రెండు గ్లాసుల నీళ్లలో గుప్పెడు పుదీనా ఆకులు వేసి 15 నిమిషాలపాటు ఉడికించాలి. తర్వాత చల్లార్చి, వడగట్టి తలస్నానం చేసి, చివర్లో ఈ నీళ్లతో వెంట్రుకలను కడిగేసుకోవాలి.