చుండ్రు వదలాలంటే?

22-04-2019: వేసవిలో వేధించే వెంట్రుకల సమస్య చుండ్రు. చమటతో కలిసిన చుండ్రు ముఖం మీదకు కారడంతో మొటిమలూ మొదలవుతాయి. వెంట్రుకలు కూడా రాలుతూ ఉంటాయి. కాబట్టి చుండ్రును తేలికైన చిట్కాలతో వదిలించుకోవాలి.
 
యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌: దీనికి యాంటీఫంగల్‌ గుణాలు ఉంటాయి. దీన్ని నేరుగా అప్లై చేయవచ్చు, పదార్థాలతో కలిపి తినవచ్చు. శరీరంలో పిహెచ్‌ బ్యాలెన్స్‌ సరిచేసి, వెంట్రుకల కుదుళ్లను బలపరచడం ద్వారా చుండ్రు తొలగిపోయేలా చేస్తుంది.
 
బేకింగ్‌ సోడా: కుదుళ్ల దగ్గర సహజసిద్ధమైన తేమ పోకుండా నిలిచి ఉండాలంటే తడిచిన కుదుళ్లకు బేకింగ్‌ సోడా పట్టించి మర్దన చేయాలి. కొద్ది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
 
కలబంద: పొడిబారిన కుదుళ్లకు మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది. దీనిలోని యాంటీసెప్టిక్‌ గుణాలు చుండ్రును పెంచే బ్యాక్టీరియాను చంపేస్తాయి.
 
యాస్ర్పిన్‌: దీన్లో అసిటైల్‌సిలిసిలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను చంపి, మృత చర్మాన్ని వదిలిస్తుంది. రెండు మాత్రలు పొడిచేసి, షాంపూతో కలిపి తల రుద్దుకుని స్నానం చేయాలి.