హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో బట్టతల నుంచి విముక్తి

ఆంధ్రజ్యోతి(11-07-13): బట్టతల ఉందని బాధపడుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బట్టతల స్థానంలో నిండైన, ఒత్తైన జుట్టు పెరిగేలా చేసే ఆధునిక చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాంటప్పుడు బట్టతలతో బాధపడుతూ కూర్చోవడం ఎందుకు? హెయిర్‌ ట్రాన్‌ ్సప్లాంటేషన్‌తో అందమైన జుట్టును సొంతం చేసుకుని ఆనందంగా జీవితాన్ని అనుభవించవచ్చని అంటున్నారు కాస్మెటిక్‌ అండ్‌ హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ ఎ. రవిచందర్‌రావు.
 
 
హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ శస్త్రచికిత్సలు చాలా ఏళ్ల నుంచే జరుగుతున్నా ఇటీవల ఈ చికిత్సల్లో అధునాతనమైన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌లో తొలి ఆధునిక శస్త్రచికిత్స ‘ఫాలిక్యులార్‌ యూనిట్‌ ఎక్సా్ట్రక్షన్‌’(ఎఫ్‌యూఈ) జపాన్‌ దేశంలో జరిగింది. ఇది చాలా అధునాతనమైన పద్ధతి. ఈ విధానంలో ఎటువంటి గాటూ,్ల కుట్లూ ఏర్పడవు. ఈ విధానంలో నొప్పి కూడా చాలా తక్కువ. ఎఫ్‌యూటీ(పట్టి విధానం)తో పోల్చుకున్నట్లయితే ఎఫ్‌యూఈ పద్ధతిలో ఒక్కొక్క వెంట్రుక మూలాలను ప్రత్యేకమైన వైద్యపరికరాల సహాయంతో దాని స్థానం నుంచి వేరుచేయడం జరుగుతుంది. అదే పట్టి విధానంలో తల వెనుక భాగంలో చర్మాన్ని (వెంట్రుక మూలాలతో సహా) వేరుచేసి ఆ తరువాత ఒక్కొక్క వెంట్రుక మూలాన్ని తొలగించిన చర్మం నుంచి వేరుచేయడం జరుగుతుంది. బట్టతల సమస్య కలవారిలో ప్రతి వెంట్రుకకు ఎంత ప్రాముఖ్యం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే వెంట్రుక మూలాలను తీసుకునేటప్పుడు సరైన దిశలో వైద్యపరికరాన్ని పోనిచ్చి, ఆ పరికరం వేగాన్ని అదుపులో ఉంచుతూ వెంట్రుక మూలం కింది భాగం వరకు వెళ్లి ఎటువంటి ఇబ్బందీ లేకుండా , ఇరుపక్కలా ఉండే వెంట్రుక మూలాలకు ఏ విధమైన హానీ కలగకుండా జాగ్రత్తగా బయటకు తీయడం జరుగుతుంది. 
అనువైన సర్జరీ
జుట్టును చిన్నగా కట్‌ చేయించుకోవాలనుకునే వారికి, భవిష్యత్తులో దేవునికి తలనీలాలు ఇచ్చినా తల వెనక భాగంలో ఎటువంటి గాటు కనిపించకూడదని కోరుకునే వారికి ఈ ఎఫ్‌యూఈ విధానం బాగా ఉపయోగపడుతుంది. శస్త్రచికిత్స అంటే భయం ఉన్న వారికి ఎఫ్‌యూఈ అనువైన విధానం. ఈ చికిత్సా విధానంలో బ్లడ్‌లాస్‌ చాలా తక్కువ. అసౌకర్యం ఉండదు. రోజు వారీ పనులకు ఆటంకం కలుగుతుందన్న భయం ఉన్నప్పుడు ఎఫ్‌యూఈ ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ విధానంలో శస్త్రచికిత్స అనంతరం రోజు వారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు.  ఏ విధమైన కుట్లూ వేయడం జరగదు. కొందరిలో తల వెనుక భాగంలోని చర్మం మందంగా ఉండి సాగే గుణం తక్కువగా ఉంటుంది. ఇటువంటి వారికి ఈ విధానం బాగా ఉపకరిస్తుంది. ఎఫ్‌యూఈ పద్ధతిలో తల భాగంలోని వె ంట్రుకలే కాకుండా దేహంలోని ఇతర భాగాలు అనగా ఛాతీ, చేతులపై ఉండే వెంట్రుకలని కూడా తలపై అమర్చుకోవచ్చు. దీనివల్ల వెంట్రుకల సంఖ్య, పరిమాణం పెరుగుతుంది. ఎఫ్‌యూఈ పద్ధతిలో తొలగించిన వెంట్రుకల ప్రాంతం తిరిగి 5 రోజులలో సాధారణ స్థితికి చేరుకుంటుంది. 
జాగ్రత్తలు అవసరం
రక్తస్రావం అధికంగా ఉన్న వారికి, రక్తం గడ్డకట్టే సమస్య కలవారికి ఈ విధానం సరిపడదు. కొందరిలో జట్టు ఉంగరాలుగా తిరిగి ఉంటుంది. ఒకవేళ వీరు శస్త్రచికిత్స చేయించుకుంటే వెంట్రుకల వృద్ధి రేటు తెలుసుకున్న తరువాత ఎఫ్‌యూఈ పద్ధతిలో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. 
చికిత్సలో పద్ధతులు
హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌లో రెండు ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. స్ట్రిప్‌ లేదా ఎఫ్‌యూఈ (ఫోలిక్యులర్‌ యూనిట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌). స్ట్రిప్‌ సర్జరీ కోసం ఒక రోజంతా క్లినిక్‌లోనే ఉండాల్సి ఉంటుంది. ఈ సర్జరీ కొన్ని గంటల పాటు జరుగుతుంది. దీనికి లోకల్‌ అనస్థీషియా సరిపోతుంది. అంటే సర్జరీ జరుగుతున్నంత సేపూ మెలకువగానే ఉంటారు. 
నమ్మలేనంత జుట్టు మీ సొంతం 
ట్రాన్స్‌ప్లాంట్‌ చేసిన శిరోజాలు నెమ్మదిగా పెరుగుతాయి. సర్జరీ చేసిన కొన్ని వారాల తరువాత అతికించిన శిరోజాలు రాలిపోతాయి. ఆ తరువాత నెమ్మదిగా పెరగటం మొదలవుతుంది. మూడు నెలల్లో మెల్లగా శిరోజాలు పెరుగుతుండటం గమనించవచ్చు. ఆరు నుంచి ఏడాది లోపల జుట్టు పూర్తిగా పెరుగుతుంది. సర్జరీకి ముందు, సర్జరీ తరువాత తేడాను స్పష్టంగా గమనించవచ్చు.నమ్మలేనంత జుట్టు మీ సొంతమవుతుంది. ఈ జుట్టు పూర్తిగా సాధారణ జుట్టు మాదిరిగానే ఉంటుంది. ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉండదు. మామూలుగా దువ్వుకోవడం చేయవచ్చు. ఈ జుట్టు ఊడిపోవడం మళ్లీ బట్టతల రావడం అంటూ జరగదు. ట్రాన్స్‌ప్లాంట్‌ చేసిన జుట్టు జీవితాంతం నిగనిగలాడుతూ ఉంటుంది. 
 
డా. ఎ. రవిచందర్‌రావు
ఎమ్‌.బి.బి.ఎస్‌, ఎమ్‌.ఎస్‌, ఎమ్‌సిహెచ్‌.                                ప్లాస్టిక్‌సర్జరీ(నిమ్స్‌)
కాస్మెటిక్‌ అండ్‌ హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌
హెయిర్‌ష్యూర్‌ హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌
హబ్సిగూడ, హైదరాబాద్‌
ఫోన్‌ : 040- 42020202, 9494020202