పట్టులాంటి జుట్టు కోసం...

08-04-2019: వేసవిలో కేశసంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిరకాల కురుల వారికి ఉపయోగపడే చిట్కాలను పాటిస్తే ఆరోగ్యకరమైన, పట్టులా మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది.
 
రంగు జుట్టు: కొబ్బరిపాలు, అవకాడో మిశ్రమం రంగు జట్టుకు మేలుచేస్తుంది. అవకాడో, కప్పు కొబ్బరిపాలను మిక్సీలో వేసి చిక్కని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి టేబుల్‌ స్పూను తేనె, నిమ్మరసం కలిపి, జుట్టుకు పట్టించాలి.
 
మృదువైను కురులు: బాగా మగ్గిన రెండు అరటి పండ్లు, రెండు టేబుల్‌స్పూన్ల ఆలివ్‌ నూనె, టేబుల్‌ స్పూను తేనెతో మాస్క్‌ను తయారుచేసుకోవాలి ఈ మాస్క్‌ను కేశాలకు అప్లై చేస్తే కురులు సున్నితంగా మారతాయి. ఈ మిశ్రమంలో కొన్ని చుక్కల లావెండర్‌ నూనె లేదా రోజ్‌ మేరీ నూనె కూడా కలపొచ్చు.
 
పొడి, దెబ్బతిన్న కేశాలు: వీటికి తేనె చక్కగా పనిచేస్తుంది. గుడ్డు పచ్చసొన, తేనె, కొబ్బరినూనెతో తయారుచేసుకున్న హెయిర్‌మాస్క్‌ వెంట్రుకలకు తేమ, ప్రొటీన్లను అందించి కురులను మెరిసేలా చేస్తుంది. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు రాసుకున్న 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.