చుండ్రుని పోగొట్టేందుకు...

ఆంధ్రజ్యోతి(5-8-15): వర్షాకాలంలో వచ్చే జుట్టు సంబంధిత సమస్యల్లో చుండ్రు ఒకటి. దాన్నుంచి బయటపడే టిప్స్‌ ఇవి...
జింక్‌ పైరిథిన్‌ అనే రసాయనం ఉన్న యాంటీ డాండ్రఫ్‌ షాంపూని మాత్రమే వాడాలి. ఇది ఫంగస్‌ వంటివి రాకుండా కాపాడుతుంది. దీనితో వారానికి కేవలం రెండు లేదా మూడుసార్లు మాత్రమే తలస్నానం చేయాలి.
వర్షంలో తడిస్తే తలస్నానం చేసి  కండీషనర్‌ రాసుకోవాలి. 
కండీషనర్‌ని వెంట్రుకలకి మాత్రమే రాసుకోవాలి. 
ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ దురద తగ్గకపోతే చర్మవ్యాధి నిపుణులని సంప్రదించాలి. 
చుండ్రు సమస్యకి తినే ఆహారం కూడా కారణం కావొచ్చు. అందుకని తీసుకునే ఆహారంలో తక్కువ చక్కెర, ఎక్కువ యాంటాక్సిడెంట్లు ఉండేలా జాగ్రత్తపడాలి.