రాలే జుట్టుకు బీట్‌రూట్‌

17-05-2018:జుట్టు రాలిపోయేందుకు కారణాలు అనేకం ఉండొచ్చు. అయితే దాన్ని తగ్గించుకునే చిట్కా మీ ఇంట్లోనే ఉంది.
 
బీట్‌రూట్‌ జ్యూస్‌
ఏడు లేదా ఎనిమిది బీట్‌రూట్‌ ఆకులను ఉడికించాలి. తరువాత వీటిని ఐదారు గోరింటాకులతో కలిపి మెత్తగా రుబ్బాలి.
ఈ మిశ్రమాన్ని మాడుకు రాసుకుని పావు గంట నుంచి 20 నిమిషాల వరకు అలానే ఉండాలి.
తరువాత గోరువెచ్చటి నీళ్లతో జుట్టును శుభ్రం చేయాలి.
ఇలా చేస్తే చాలా వరకు జుట్టు రాలడాన్ని తగ్గించొచ్చు. ఈ చిట్కాలు పాటించడంతో పాటు తినే ఆహారం మీద కూడా శ్రద్ధ పెట్టాలి. అప్పుడే జుట్టు రాలడాన్ని పూర్తిగా ఆపడం సాధ్యమవుతుంది.