సంతానం కోసం వర్కవుట్స్‌

ఆంధ్రజ్యోతి(17-10-2016): కార్డియోవాస్క్యులర్‌ ఎక్సర్‌సైజ్‌లలో ముఖ్యమైనది సైక్లింగ్‌. రోజు గంటసేపు సైక్లింగ్‌ చేయడం వల్ల చెడుకొవ్వు తగ్గుతుంది. తద్వారా హృద్రోగ ముప్పునుంచి తప్పించుకోవచ్చు. టైప్‌-2 డయాబెటిస్‌ అంత ఈజీగా రాదు. కాబట్టి సంతాన సాఫల్యత అవకాశాలు మెరుగవుతాయి. పిల్లలు కలగడానికి సైక్లింగ్‌ చక్కటి మార్గం. 

యోగా, ధ్యానం వల్ల ఉచ్చ్వాస నిశ్చ్వాసల్లో స్వేచ్ఛ లభిస్తుంది. ఎప్పుడైతే హాయిగా ఊపిరి తీసుకుంటామో అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. దాంతో ఆందోళన తగ్గుతుంది. సంతాన సాఫల్యత కోసం ప్రత్యేకమైన యోగాసనాలు ఉన్నాయి. వాటిని చేస్తే కండరాలు చురుగ్గా మారి.. ఫలితం వచ్చే అవకాశం ఉంది.

స్విమ్మింగ్‌ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ అవకాశాలు పెరుగుతాయి. శరీరంలోని కండరాలన్నింటికీ చక్కటి వ్యాయామం లభిస్తుంది. సంతానం కోసం మందులు వాడేవారు స్విమ్మింగ్‌ చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

మ్యూజిక్‌కు అనుగుణంగా డ్యాన్స్‌ చేయడం వల్ల కూడా అద్భుత ఫలితాలు వస్తాయి. ఇది కార్డియో వర్కవుట్‌లాగ కూడా పనికొస్తుంది. కండరాలను పటిష్టంగా ఉంచి.. పటుత్వాన్ని పెంచుతుంది. దాంతో ప్రెగ్నెన్సీకి మార్గం ఏర్పడుతుంది.