వీర్యకణాలు లేనివారికి ఆయుర్వేద చికిత్స

ఆంధ్రజ్యోతి(19/03/13): మన సమాజంలో సంతానలేమి పెద్ద సామాజిక సమస్యగా మారింది. సంతానలేమి సమస్యల్లో ఎక్కువగా స్త్రీలనే కారణంగా చూపిస్తున్నారు. కాని పురుషుల్లో కూడా అందులో సగం మంది కారణమని తెలుసుకోలేక పోతున్నారు. వీర్యంలో వీర్యకణాలు పూర్తిగా లేకపోవడాన్ని అజోస్పెర్మియాగా పేర్కొంటారు. అజోస్పెర్మియాకు ఆయుర్వేదంలో మంచి ఔషధాలు అందుబాటులో ఉన్నాయంటున్నారు  ఆయుర్వేద వైద్యనిపుణులు డాక్టర్‌ ఎం. నరసింహ.
 
వీర్యంలో వీర్యకణాలు పూర్తిగా లేకపోవడం వల్ల సంతానలేమితో బాధపడుతున్న పురుషుల సంఖ్య పెరుగుతోంది. సాధారణంగా పెళ్లి అయ్యాక ఎలాంటి గర్భనిరోధకాలు పాటించకుండా శృంగారంలో పాల్గొంటే మొదటి నెలలో 25 శాతం మందికి, 6 నెలల్లో 75 శాతం వరకు, ఏడాది వరకు 85 శాతం మందికి గర్భం దాల్చే అవకాశం ఉంది. కాని 15 నుంచి 20 శాతం మందికి సంతానం కలగక పోవచ్చు. 
కారణాలు 
పురుషుల్లో వీర్యకణాల సంఖ్య పూర్తిగా లేకపోవడానికి పలు కారణాలున్నాయి. 
గవదబిళ్లలు : యుక్తవయసు తర్వాత వచ్చే గవదబిళ్లల వల్ల బీజాలకు ఇన్ఫెక్షన్‌ సోకి బీజాల్లో వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది.
కిప్టార్కిడిజమ్‌ : గర్భావస్థలో  బీజాలు శిశువు కడుపులోనే ఉంటాయి. ప్రసవం అయ్యే సమయం వరకు ఇవి బీజకోశంలోనికి వస్తాయి. ఏ కారణం చేతనైన బీజాలు బీజకోశంలోకి రాకపోవడాన్ని కిప్టార్కిడిజమ్‌ అంటారు.
బీజాల సమస్యలు: బీజాలను ఉత్పత్తి చేయాలంటే బీజకోశంలోనికి తప్పనిసరిగా రావాలి. ఎందుకంటే ఇవి కడుపులో ఉంటే అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల వీర్యకణాలను ఉత్పత్తి చేయలేవు. బీజాలు బీజకోశంలోకి రాకుంటే చిన్నప్పుడే తల్లిదండ్రులు గమనించి చికిత్స చేయించాలి. 
వెరికోసిల్‌ : బీజాల్లో వెరికోసిల్‌ ఎక్కువగా ఉండటం వల్ల కూడా వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. బీజాలకు ఏ కారణం చేతనైనా దెబ్బలు తగలడం వల్ల బీజాలు చిన్నవిగా మారటంతో వీర్యకణాలను ఉత్పత్తి చేయలేకపోతాయి. 
ఈస్ట్రోజన్‌ హార్మోన్‌లు : పురుషుల్లో వీర్యకణాల లోపాలకు ఈస్ట్రోజన్‌ కూడా కారణంగా చెప్పవచ్చు. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ బాడీలోషన్స్‌, మాంసాల్లో ఉంటుంది. మాంసం బాగా వృద్ధి చెందేందుకు ఈ హార్మోన్‌ వాడతారు. ఇది తీసుకున్న వారిలో వీర్యకణాల లోపాలు ఏర్పడవచ్చు. గర్భావస్థలో గర్భస్రావం కాకుండా తల్లికి వాడిన ఈస్ట్రోజన్‌ హార్మోన్స్‌ వల్ల వారికి పుట్టిన మగపిల్లల్లో శుక్రకణాల సంఖ్య తగ్గడం, క్రిస్పార్కిడిజమ్‌ ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. 
క్లైన్‌ ఫిల్టర్‌ సిండ్రోమ్‌ : సాధారణంగా పురుషుల్లో ఎక్స్‌, వై క్రోమోజోమ్‌లుంటాయి. కాని ఈ సిండ్రోమ్‌ ఉన్న వారిలో ఎక్స్‌ ఎక్స్‌ వై క్రోమోజోమ్‌లుంటాయి. వీరిలో బీజాలు చిన్నవిగా ఉంటాయి. యుక్తవయసు లక్షణాలు ఆలస్యం అవడం, వృక్షోజాలు పెరుగుదల కనిపిస్తుంది. దీన్ని కారిమోటైపింగ్‌ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు : పిల్లలు కలగని వారికి మొదట రేతు పరీక్ష చేయించుకోవాలి. శుక్రం, వీర్యం, రీతస్సు అనేవి ఆయుర్వేదంలో సమాన అర్థంలో చెపుతారు. రేతు పరీక్షలో ఒకటి ద్రవత్వాన్ని, క్షీణరేతస్సులో వీర్యంలో శుక్రకణాల గురించి తెలియజేస్తుంది. ఈ పరీక్ష చేయించుకునేందుకు ముందు 3 నుంచి అయిదు రోజులు భార్యాభర్తలు కలవకుండా పరీక్ష చేయించుకోవాలి. దీంతోపాటు వృషణాల్లో వచ్చే వెరికోసిల్‌, వృషణాల సైజు, వృషణాల్లో రక్తప్రసరణను తెలుసుకోవచ్చు. హార్మోన్‌ల పరీక్ష, టెస్టిక్యులార్‌ బయాప్సీ పరీక్షలు చేయించాలి. వృషణాల నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష ద్వారా వీర్యకణాలు ఉత్పత్తి అవుతున్నాయా లేదా అనే విషయం తెలుస్తుంది. 
ఆయుర్వేద చికిత్స 
ఆయుర్వేదంలో సంతానలేమిని వంధత్యమని చెపుతారు. అజోస్పెర్మియాకు ఆయుర్వేదంలో మంచి ఔషధాలున్నాయి. ఆయుర్వేద మూల గ్రంధాలైన చరక సంహిత, సుశ్రుత సంహితలలో వాజీకరణ విభాగాల్లో పురుషుల్లో సంతానలేమిని శుక్రదోషాలుగా పేర్కొన్నారు. శుక్ర దోషాలు 8 రకాలుగా పేర్కొన్నారు. ఇవి వాత, పిత్త, కఫ దోషాల వల్ల ఏర్పడతాయని పేర్కొన్నారు.
వాజీకరణ ఔషధాలు : పంచకర్మ చికిత్సలు చేసిన తర్వాత వాజీకరణ ఔషధాలు ఇచ్చినపుడు మంచి ఫలితాలు వస్తాయి. పంచకర్మ చికిత్సల్లో వస్తి, కషాయవస్తులు, ఉత్తరవస్తి చికిత్సలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వాజీకరణ ఔషధాల్లో శుక్ర  జనకాలు శుక్రాన్ని వృద్ధి చేస్తాయి. శుక్రప్రవర్తకాలు వీర్యాన్ని వచ్చేటట్లు ఉపయోగపడతాయి. శుక్ర జనకప్రవర్తకాలు వీర్యాన్ని వృద్ధి చేసి అది బయటకు వచ్చేందుకు దోహదపడతాయి. శుక్ర భోధకాలు వీర్యంలోని దోషాలను తొలగించి వీర్యం యొక్క గుణవృద్ధిని చేస్తాయి. వాజీకరణ ఔషధాలు 6 నెలల నుంచి ఏడాది కాలంపాటు తీసుకోవటం వల్ల అజోస్పెర్మియా సమస్యకు మంచి ఫలితాలు వస్తాయి. ఎటువంటి దుష్ప్రభావాలు వీటి వల్ల ఉండవు. 
 
 డాక్టర్‌ ఎం. నరసింహ
ఎం.డి (ఆయుర్వేద), సెక్సాలజిస్ట్‌ 
యస్‌.బి. స్పెషాలిటీ క్లినిక్‌ 
హైదరాబాద్‌, విజయవాడ,తిరుపతి
ఫోన్స్‌ : 924656 4433
         939656 4433