వీటితో నిద్రపడుతుంది

ఆంధ్రజ్యోతి(3-12-15): కొందరు పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు. మరికొందరికి ఎంతసేపు పడుకున్నా నిద్రరాదు. ఒకవేళ నిద్ర పట్టినా మధ్యలో మేలుకుంటుంటారు. మళ్లీ నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. అటువంటివారికి త్వరగా, హాయిగా నిద్రపట్టాలంటే  ఇవి తినాలి.

ఉదయం అల్పాహారంలో గుడ్లు తీసుకోవాలి. వాటిల్లో ఉండే అమైనో యాసిడ్స్‌ శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి సరైన సమయంలో నిద్రపట్టడానికి ఉపయోగపతాయి. ఒక గ్లాసు చెర్రీ జ్యూస్‌ తాగినా ఇట్టే నిద్ర పట్టేస్తుంది. రాత్రిపూట అన్నం తింటే లావైపోతామని చాలామంది అసలు తినరు. కానీ అన్నం వంటి పదార్థాల్లో నిద్రరావడానికి ఉపయోగపడే గ్లైసిమిక్‌ అధికంగా ఉంటుంది. అందువల్ల రాత్రిపూట కొద్ది పరిమాణంలో అయినా అన్నం తింటే హాయిగా నిద్రపోవచ్చు.