బరువు పెరిగేందుకు డైట్..

ప్రశ్న: నా వయసు 30. ఎత్తు ఆరు అడుగులు. బరువు యాభై ఐదు కిలోలు. మరింత బరువు పెరగడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?

- దీప, శ్రీకాళహస్తి 
 
సమాధానం: మీ వయసును బట్టి , జీవన విధానాన్ని బట్టి మీకు 2000 కెలోరీల ఆహారం అవసరం. బరువు పెరగాలంటే అన్నం, కూరల మోతాదు పెంచడంతో పాటు, రోజుకు కనీసం అరలీటరు పాలు, అరలీటరు పెరుగు తీసుకోండి. ఉదయాన్నే పది నానబెట్టిన బాదం గింజలు, రెండు గుడ్లు తినండి. నిత్యం రెండు రకాల పళ్ళు ఆరగించండి. సాయంత్రం ఓ గుప్పెడు వేరుశెనగ పప్పు నోట్లో వేసుకోండి. గుడ్లు, పాలు, పెరుగు, పప్పులన్నిటిలో కండరాల అభివృద్ధికి అవసరమయ్యే మాంసకృత్తులు అధికం. ఈ రకంగా ఆరోగ్యకరమైన ఆహార విధానం ద్వారా బరువు పెరిగే ప్రయత్నం చేయడం మంచిది. నూనెలో వేయించిన పదార్థాలు, స్వీట్లు, చాక్‌లెట్లు, పిజ్జాలు, బర్గర్‌లు తినడం వల్ల కూడా కొంత బరువు పెరిగినా, ఆ అలవాట్లు తరువాతి కాలంలో అనారోగ్యానికి దారితీస్తాయి. తిన్న ఆహారం ఒంటబట్టాలంటే వ్యాయామం అవసరం. పోషకాహారం, వ్యాయామం, తగిన నిద్ర.. ఈ మూడూ ఉంటేనే బరువు పెరిగే అవకాశం ఉంది.
 
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను 
[email protected] కు పంపవచ్చు)