మెగ్నిషియం తప్పనిసరి

ఆంధ్రజ్యోతి(11-10-2016): శరీరంలో జరిగే దాదాపు 300కు పైగా జీవకియ్రలకు మెగ్నిషియం అవసరం ఉంటుంది. డైలీ డైట్‌లో మెగ్నిషియం పాళ్లు ఎక్కువగా ఉన్న ఆహారం ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 
మెగ్నిషియం లోపించడం వల్ల కండరాలు పట్టేయడం, అలసట, రక్తపోటు అధికమవడం, జ్ఞాపకశక్తి లోపించడం, శ్వాసకోశ సమస్యలు, వినికిడి లోపం, చేతులు తిమ్మిర్లు పట్టడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. జ్ఞాపకశక్తి కూడా మందగిస్తుంది.
మెగ్నిషియం లోపాన్ని గుర్తించనట్లయితే దీర్ఘకాలంలో గుండె సంబంధిత అనారోగ్యం తలెత్తే ప్రమాదం ఉంది.
ఈ లోపాన్ని అధిగమించాలంటే ఆకుకూరలు తప్పనిసరిగా తినాలి.
గుమ్మడికాయ విత్తనాలు, కాజు, టమోట, పెరుగు, సోయాబీన్స్‌, అవకాడో, అరటిపండ్లు, ఆలుగడ్డలు, నిమ్మజాతి పళ్లలో మెగ్నిషియం అధికంగా ఉంటుంది.