మధుమేహానికి మందులు వాడకుండా ఆహార నియమాలు పాటిస్తే..

ఆంధ్రజ్యోతి(15-01-2020) 


ప్రశ్న: నాకు 28 ఏళ్లు. మందులు, ఆహార నియమాలతో డయాబెటిస్‌ అదుపులోకి వచ్చింది. ఇకపై మందులు వాడకుండా ఆహార నియమాలు మాత్రమే పాటిస్తే సరిపోతుందా? 
- శ్రీలత, హైదరాబాద్‌

 

 

డాక్టర్ సమాధానం: మధుమేహం జీవక్రియకు సంబంధించిన వ్యాధి. టైప్‌-1, టైప్‌-2 మధుమేహ బాధితుల రక్తంలో గ్లూకోజు శాతం అనారోగ్యకర మోతాదులో ఉంటుంది. దీనివల్ల పలు సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సూక్ష్మ రక్తనాళాలుండే కళ్ళు, మూత్రపిండాలు, అరికాళ్ళు... తదితర శరీర భాగాలకు దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చు. మధుమేహం ఉన్నవారు రక్తంలో గ్లూకోజు పరిమాణం, వ్యాధి స్థాయి, వాడుతున్న మందులు, జీవన విధానాన్ని బట్టి ఆహార నియమాలను పాటిస్తే కొంతవరకు గ్లూకోజును అదుపులో ఉంచవచ్చు. మీ విషయంలో మందులు, ఆహార నియమాల వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులోకి వచ్చినప్పటికీ, నిపుణుల సలహా లేకుండా మందులు మానెయ్యడం వల్ల మళ్లీ చక్కర స్థాయి పెరిగే ఆస్కారం ఉంది. వైద్యులు, పోషకాహార నిపుణుల సలహా మేరకు తగిన ఆహారాన్ని తీసుకుంటూ, వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకుంటే వ్యాధిని అదుపులో ఉంచుకోవడం కష్టమేం కాదు. మీరూ ప్రయత్నించండి.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను 
[email protected]కు పంపవచ్చు)