అంజీర్‌ అద్భుతం..!

ఆంధ్రజ్యోతి (26-11-2019): మార్కెట్లో ఎక్కడ చూసినా నోరూరించే అత్తిపండ్లు కనిపిస్తున్నాయి. ఇవి విలువైన పోషకాలకు నిలయాలు. కాబట్టి ప్రతి రోజూ అంజీర్‌ తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలేమంటే..

 
రోగనిరోధకశక్తి: అంజీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
 
ఇన్సులిన్‌: ఈ పండ్లలో అధికంగా ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తంలోని ఇన్సులిన్‌ స్రావం విడుదలను సమం చేస్తుంది. దాంతో మధుమేహం అదుపులో ఉంటుంది.
 
మొటిమలు: అత్తిపండ్లు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, చర్మం ఎర్రబారకుండా చేస్తాయి. మొటిమల్ని తగ్గిస్తాయి.
 
ఎముకలు దృఢం: వీటిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి.
 
అధిక బరువు: అంజీర్‌లోని పీచు ఆకలిని నియంత్రించి, అధిక బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
 
కేన్సర్‌ నుంచి రక్ష: ఈ పండ్లలో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి రొమ్ము, పెద్దపేగు, ప్రోస్టేట్‌లలో కేన్సర్‌ కణాల అభివృద్ధిని అడ్డుకుంటాయి.