పుదీనా సువాసనతో...

ఆంధ్రజ్యోతి (24-12-2019): ఆరోమాథెరపీతో సుగంధాలను లోనికి తీసుకోవడం అంటే, శరీరంలోని దుర్గంధాలను బయటికి పంపడమే! పీల్చిన సుగంధాలు శ్వాసకోశాల్లో నిండిపోయి అక్కడి నుంచి రక్తంతో కలిసి శరీరంలోని అణువణువూ వ్యాపిస్తాయి. అలాంటి సుగంధ మొక్కల్లో పుదీనా ఒకటి. పుదీనా ఆకుల వాసన మెదడును ఉత్తేజితం చేస్తుంది. ఒత్తిళ్లతో అలసిపోయిన మెదడుకు శక్తిదాయకంగా పనిచేస్తుంది. ఏకాగ్రతను పెంచడం ద్వారా స్పష్టమైన ఆలోచనలకు మూలమవుతుంది. ఉత్సాహాన్ని నింపడంతో పాటు నీరసాన్ని దూరం చేస్తుంది. పుదీనా వాసన పీల్చడంతో తలనొప్పులు తగ్గడంతో పాటు, పూడుకుపోయిన సైనస్‌ గదులు శుభ్రమవుతాయి. మైగ్రేన్‌ సమస్య తగ్గిపోయేలా చేస్తుంది. నాణ్యమైన నిద్రకు బాగా ఉపయోగపడుతుంది. భావోద్వేగాల్లో స్థిమితత్వాన్ని తెస్తుంది.