పండ్లు అవసరమే!

మధుమేహులు పండ్లు తినకూడదు అనుకుంటారు. నిజానికి పండ్ల రసాలు తీసుకోకూడదు. కానీ, రోజుకు 100 నుంచి 400 గ్రాముల వరకు నేరుగా పండ్లు తినవచ్చు. వాటిలో యాపిల్‌, నారింజ, బొప్పాయి, దానిమ్మ, జామ, సపోటా, సీతాఫలం, పుచ్చకాయ, పైనాపిల్‌ పండ్లను పరిమితంగా తీసుకోవాలి. మధమేహులతో పాటు స్థూలకాయులు, గుండె రక్తనాళాల జబ్బులు ఉన్నవారు కూడా ఇదే నియమం పాటించాలి.

 
ఆహారంలో పండ్లు లోపిస్తే, విటమిన్లు శరీరానికి అందవు. అయితే రక్తంలో ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నవారు పండ్లు తినకూడదు. వీరు రోజుకు 25 నుంచి 40 గ్రాముల పీచు పదార్థం తప్పనిసరిగా తీసుకోవాలి. కూరగాయలు, కాయధాన్యాలు, చిక్కుడు ధాన్యాల్లో పీచుపదార్థం మెండుగా ఉంటుంది. కాబట్టి విధిగా తీసుకోవాలి. పీచుపదార్థాలు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా గ్లూకోజ్‌ అరుగుదల వేగాన్ని తగ్గిస్తాయి. వీటివల్ల కలిగే అధనపు ప్రయోజనం ఇదే! పీచుపదార్థం వల్ల తొందరగా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది కాబట్టి, అతిగా తినే పరిస్థితి ఉండదు.
 
-డాక్టర్‌ పి. దక్షిణామూర్తి,
సీనియర్‌ ఫిజిషియన్‌,
తెనాలి