సోయా నూనెతో మెదడులో జన్యుమార్పులు

లాస్‌ ఏంజెలిస్‌, జనవరి 17:వంటకు సోయా నూనె వాడుతున్నారా? దాని వాడకంతో మెదడులో జన్యుపరమైన మార్పులూ జరగొచ్చని అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎలుకలపై జరిపిన ప్రయోగ పరీక్షల ఫలితాల విశ్లేషణ అనంతరం వారు ఈవిషయాన్ని వెల్లడించారు. అధ్యయనంలో భాగంగా కొన్ని ఎలుకలను మూడు గ్రూపులుగా విభజించి, వాటికి మూడు రకాల నూనె(సోయాబీన్‌ నూనె, లినోలిక్‌ యాసిడ్‌ మోతాదు తక్కువగా ఉండే సోయాబీన్‌ నూనె, కొబ్బరి నూనె)లు అందించారు. అనంతరం వాటి మెదళ్లలో జరుగుతున్న మార్పులను గమనించారు.