ఆకుకూరలతో ఆటల్లో అదరహో

ఆంధ్రజ్యోతి(11-10-2016): నైట్రేట్‌ పుష్కలంగా ఉండే పాలకూరలాంటి వాటిని తింటే ఆటల్లో యువత మంచి సత్తా చూపించగలదట. ఇటీవల బెల్జియంలోని లువెన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ విషయాన్ని 27 మంది అభ్యర్థులపై పరీక్షలు నిర్వహించి కనుగొన్నారు. స్ర్పింట్‌ ఇంటర్‌వెల్‌ ట్రైనింగ్‌లో వీరికి నైట్రేట్‌ సప్లిమెంట్లు ఇచ్చారు. ఈ శిక్షణలో భాగంగా వారంలో మూడురోజులపాటు వీరితో సైక్లింగ్‌ చేయించారు. పాలకూర వంటి ఆకుకూరల్లో నైట్రేట్‌ బాగా ఉంటుంది. శరీరం ఆరోగ్యకరంగా పనిచేయడానికి ఇది చాలా అవసరం కూడా.
 
అందులోనూ వ్యాయామాలు చేసేటప్పుడు నైట్రేట్‌ శరీరానికి ఎంతో బాగా పనిచేస్తుంది. నైట్రేట్‌ ఉన్న పదార్థాలు పెట్టి వివిధ పరిస్థితుల్లో అభ్యర్థుల ‘పర్ఫామెన్స్‌’ ఎలా ఉందో ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు పరిశీలించారు. నార్మల్‌ ఆక్సిజన్‌ కండిషన్స్‌లో వీరి ప్రదర్శన తీరు ఎలా ఉంది, హైపోక్సియా అంటే తక్కువ ఆక్సిజన్‌ ఉన్న కండిషన్స్‌లో వీరి పర్ఫామెన్స్‌ ఎలా ఉంది... వంటి అంశాలను పరిశీలించారు. ఐదు వారాల్లోనే ఇందులో పాల్గొన్న అభ్యర్థుల మజిల్‌ ఫైబర్‌ కంపోజిషన్‌లో మార్పు వచ్చింది. ఆక్సిజన్‌ తక్కువగా ఉన్న కండిషన్స్‌లో శిక్షణ ఇచ్చిన అభ్యర్థుల్లో నైట్రేట్‌ పెరగడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు.
 
న్యూట్రిషనల్‌ సప్లిమెంట్‌ సా్ట్రటజీ శిక్షణ ద్వారా మజిల్‌ ఫైబర్‌ కంపోజిషన్‌లో మార్పు తేవడంలో వీరు విజయం సాధించారు. తక్కువ ఆక్సిజన్‌ ఉన్నచోట్ల క్రీడాకారులు తమ పటిమను చూపడానికి ఈ స్టడీ ఫలితాలు ఎంతో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చాలామంది అథ్లెట్స్‌కు హై ఆల్టిట్యూడ్‌ కండిషన్స్‌లో శిక్షణ ఇవ్వడాన్ని శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. క్రానిక్‌ హైడోస్‌ నైట్రేట్‌ ఇన్‌టేక్‌ సేఫ్టీ పరీక్ష చేసిన తర్వాతే క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ నైట్రేట్‌ ఇన్‌టేక్‌ ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు