ఉదయమా? సాయంత్రమా?

18-06-2019: పొద్దుపొద్దున్నే అంతా హడావిడే కదా! వ్యాయామం సాయంత్రం చేయడమే మేలని కొందరు అనుకుంటారు. మరికొందరేమో సాయంత్రమయ్యే సరికి రోజువారీ పనుల్లో బాగా అలిసిపోయి ఉంటాం. అప్పుడింక ఓపిక ఏముంటుంది? అందుకే పొద్దున్నే చేసేయడం బెటర్‌ అనుకుంటారు. ఇలా ఏ సమయం సౌకర్యవంతమో మనం ఆలోచిస్తాం. సౌకర్యం మాట సరే... వ్యాయామం ఏ వేళ చేస్తే ఎక్కువ ప్రయోజనం అనేది అసలు మీమాంస. మిగతా అందరి మాట ఎలా ఉన్నా, శాస్త్రవేత్తలు ఈ విషయంలో ఇటీవల కాస్త భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ వేళ చేస్తే బెటర్‌ అని కాకుండా రెండు వేర్వేరు వేళల్లో చేసే వ్యాయామ ఫలితాలు వేర్వేరుగా ఉంటున్నాయని మాత్రం చెబుతున్నారు.
 
ఉదయం వ్యాయామాలు షుగర్‌, ఫ్యాట్‌లకు సంబంధించిన జీవక్రియలను తేజోవంతం చేస్తాయి. దీనివల్ల అధిక బరువు, టైప్‌- 2 మధుమేహం తగ్గుముఖం పడతాయి.
 
ఉదయం చేసే వ్యాయామాలు జన్యు ప్రణాళికను చైతన్యపరుస్తాయనీ, అదే సమయంలో కండర కణాల సామర్థ్యాన్ని కూడా పెంచుతాయనీ పేర్కొన్నారు. అంతకన్నా ముఖ్యంగా ఉదయం వ్యాయామాలు షుగర్‌, ఫ్యాట్‌లకు సంబంధించిన జీవక్రియలను తేజోవంతం చేస్తాయని కనుగొన్నారు. దీనివల్ల అధిక బరువు, టైప్‌- 2 మధుమేహం తగ్గుముఖం పడతాయని కూడా వారు చెబుతున్నారు. ఉదయం చేసే వ్యాయామాల వల్ల ఎంతో కాలంగా వేధిస్తున్న జీవక్రియలకు సంబంధించిన కొన్ని రకాల జబ్బులు కూడా నయమవుతాయని కూడా వివరించారు.
సాయంత్రం చేసే వ్యాయామాల వ ల్ల ఆ తర్వాత చేసే విధుల్లో ఎక్కువ శక్తినీ, అంటే ఎక్కువ శ్రమించి క్యాలరీలను బాగా ఖర్చుచేసే సత్తా పెరుగుతుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తానికి, ఏ వేళ వ్యాయమాలు తమకు అనుకూలమో, ఏ ప్రయోజనాలు తమకు ముఖ్యమో ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే!