వర్కవుట్‌ స్నాక్స్..‌!

ఆంధ్రజ్యోతి (06-11-2019): వర్కవుట్‌కు ముందు, తర్వాత ఏం తినాలి? అనే విషయం గురించి ఎన్నో అనుమానాలు ఉంటాయి. వ్యాయామాలు చేయడానికి సరిపడా శక్తి అందండంతో పాటు, వ్యాయామం తర్వాత -అలసటను తొలగించే స్నాక్స్‌ ఇవే.

కార్డియో: కార్డియో వ్యాయామాలు చేసేవారు ఆ వ్యాయామాలకు అరగంట ముందు ఒక పెద్ద సైజు పియర్స్‌ను ఒకటిన్నర టీస్పూన్ల తేనెతో కలిపి తినాలి. ఈ స్నాక్‌ సుమారుగా 150 కేలరీల శక్తి అందుతుంది. కార్డియో తర్వాత 3/4 కప్పుల చాక్లెట్‌ మిల్క్‌ తాగవచ్చు. ఒక చిన్న అరటిపండు తినవచ్చు. ఈ స్నాక్‌లో అలసిన కండరాలకు సరిపడా ప్రొటీన్‌ ఉంటుంది.
 
హిట్‌ క్లాసెస్‌: సర్క్యూట్‌/ఇంటర్వెల్‌ వర్కవుట్స్‌ చేసేవారు రెండు స్లైసుల బ్రౌన్‌ బ్రెడ్‌, పళ్లతో తయారైన జామ్‌తో కలిపి తినవచ్చు. ప్రొటీన్లు, ఫ్యాట్స్‌ ఏమాత్రం లేని ఈ స్నాక్‌తో 160 కేలరీల శక్తి అందుతుంది. వర్కవుట్‌ తర్వాత రెండు టేబుల్‌ స్పూన్ల అవకాడో, 3 టేబుల్‌ స్పూన్ల ష్రెడెడ్‌ చీజ్‌ తినాలి. దీన్లో సరిపడా కొవ్వులు, ప్రొటీన్‌తో పాటు 171 కేలరీలు కూడా ఉంటాయి.
 
వెయిట్‌ ట్రైనింగ్‌: ఒక కప్పు ఉడికించిన పచ్చి బఠాణీ, చిక్కుళ్లు తినవచ్చు. దీన్లో 190 కేలరీలు ఉంటాయి. నాన్‌ఫ్యాట్‌ యోగర్ట్‌, పావు కప్పు స్ర్టాబెర్రీలు తినాలి. దీన్లో ఉండే 26 గ్రాముల ప్రొటీన్‌ వెయిట్‌ ట్రైనింగ్‌తో అలసిన కండరాలకు శక్తినిస్తుంది.