ఒబెసిటీకి గుడ్‌బై

ఆంధ్రజ్యోతి(20-4-15): పిల్లాడు బొద్దుగా ఉన్నాడని ముద్దు చేస్తుంటారు. కానీ పెరిగి పెద్దయ్యాక ఆ స్థూలకాయమే అనేక అనర్థాలకు దారితీస్తుంది. స్థూలకాయం మూలంగానే రకరకాల వ్యాధులు వచ్చిపడుతున్నాయి. అయితే ఆయుర్వేద చికిత్సలతో అధిక బరువును తగ్గించుకుని ఆరోగ్యవంత
మైన జీవనం గడపవచ్చని అంటున్నారు డాక్టర్‌ మనోహర్‌. 
 
 ఈ మధ్యకాలంలో స్థూలకాయం ఒక ప్రధాన సమస్యగా మారింది. చిన్న పిల్లల్లో సైతం ఈ సమస్య కనిపిస్తోంది. ప్రతీ పదిమందిలో ముగ్గురు స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఈ సమస్యను ఆయుర్వేదంలో స్థౌల్యం అంటారు. స్థూలకాయం ఒక వ్యాధి కాకున్నా అనేక వ్యాధులకు కారణమవుతుంది.
కారణాలు 
ఆహారం అధికంగా తీసుకోవడం 
జంక్‌ ఫుడ్‌ తినడం
శారీరక శ్రమ లేకపోవడం
మానసిక ఒత్తిడి ఉండటం
స్త్రీలలో హార్మోన్‌ సమతుల్యత దెబ్బతినడం
హైపోథైరాయిడిజం
కొన్ని రకాల మందులు ఎక్కువగా తీసుకోవడం 
వంశపారంపర్యంగా స్థూలకాయం రావడానికి కూడా అవకాశం ఉంటుంది.
కాంప్లికేషన్స్‌
స్థూలకాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ పెరగడంతో పాటు గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఎక్కువే.
స్థూలకాయం వల్ల ఆర్థరైటిస్‌, శ్వాస సంబంధ సమస్యలు రావచ్చు. 
నిర్ధారణ
ఒక వ్యక్తి స్థూలకాయంతో బాధపడుతున్నాడని నిర్ధారించడానికి బాడీమా్‌సఇండెక్స్‌(బీఎమ్‌ఐ)ఉపయోగపడుతుంది.
బీఎమ్‌ఐ = బరువు కేజీలలో / ఎత్తు మీటర్లలో 
బీఎమ్‌ఐ సూచి - పురుషుల్లో 17 నుంచి 27
స్త్రీలలో 17 నుంచి 25 ఉంటే సాధారణం అని చెప్పుకోవచ్చు. 
బీఎమ్‌ఐ 27 నుంచి 32 ఉంటే అధిక బరువు ఉన్నట్లుగా భావించాలి.
32 కన్నా ఎక్కువ ఉంటే స్థూలకాయులుగా నిర్ధారించుకోవాలి.
చికిత్స
స్థూలకాయం సమస్యను ఆయుర్వేదంలో మేదోరోగంగా పరిగణించడం జరిగింది. దీనికి శోదన, శమన అని రెండు రకాల చికిత్సలు అద్భుతంగా ఉపయోగపడతాయి. శోధన చికత్సలో కషాయవస్తి ప్రధాన చికిత్స అని చెప్పవచ్చు. దీనితో పాటు ఉద్వర్తనం, స్వేదనం లాంటి చికిత్సలు ఉపయోగకరంగా ఉంటాయి. శమన చికిత్సలో నాలుగవ ధాతువైన మేధోదాతువును కరిగించుటకు కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు సూచించడం జరుగుతుంది. అలాగే ప్రతి వ్యక్తి కూడా అవసరమైన మేరకు శారీరక వ్యాయామం చేయడం, జీర్ణశక్తిని అనుసరించి ఆహారం తీసుకోవడం వల్ల స్థూలకాయం రాకుండా కాపాడుకోవచ్చు. 
 
 
డా. మనోహర్‌, ఎండీ. ఆయుర్వేద
స్టార్‌ ఆయుర్వేద, ఫోన్‌ : 8977336677

www.starayurveda.com

email : [email protected]