నాన్‌ సర్జికల్‌ లైపోసక్షన్‌తో నాజుకైన శరీరాకృతి

ఆంధ్రజ్యోతి(03-07-13): అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. వయసు పైబడటం మూలంగా వచ్చే లక్షణాలను కప్పిపుచ్చుకోవాలనే ఆరాటమూ ఉంటుంది. కానీ మారిన జీవనవిధానం వల్ల శరీరాకృతి దెబ్బతింటోంది. స్థూలకాయం వచ్చిపడుతోంది. అయితే శరీరాకృతిని కాపాడుకోవడానికి, అందంగా తీర్చిదిద్దుకోవడానికి  నాన్‌ సర్జికల్‌ లైపోసక్షన్‌ చక్కగా ఉపయోగపడుతుందని అంటున్నారు  డాక్టర్‌ జి. కిషోర్‌రెడ్డి.
 
అందాలను ఇనుమడింపచేయడానికి అందుబాటులో ఉన్న కాస్మెటిక్‌ చికిత్సలలో ఇప్పుడు అలా్ట్రసోనిక్‌ లైపోసక్షన్‌ తాజాగా వచ్చిన అధునాతన చికిత్స. అల్ర్టాసౌండ్‌ విధానంలో సర్జరీ లేకుండా కొవ్వును కరిగించడం ఈ చికిత్స ప్రత్యేకత. శరీరాకృతి అందంగా కనపడేందుకు ఇటీవలి వరకు సర్జరీ ఒక్కటే మార్గమని భావించేవారు. అయితే సర్జరీ అవసరం లేకుండా శరీరంలోని కొవ్వును కరిగించడం అలా్ట్రసౌండ్‌ లైపోసక్షన్‌తో ఇప్పుడు చాలా సులభం. శరీరంలో చేరిన అదనపు బరువును తొలగించడం, కొవ్వు కారణంగా ముడతలు పడిన చర్మాన్ని సరిచేయడం ఇక ఎంత మాత్రం కష్టం కాదు. శరీరంలోని ఒక నిర్ధిష్టమైన భాగంలో కొవ్వును కరిగించడం ఈ విధానం ప్రత్యేకత. ఏ భాగంలో కొవ్వును కరిగించాలో ఆ భాగంలో మాత్రమే అలా్ట్రసౌండ్‌ తరంగాలను పంపించి కొవ్వును కరిగిస్తారు. శరీరంపై ఎటువంటి గాటు లేకుండా, నొప్పి అనేది లేకుండా ఈ చికిత్స జరుగుతుంది. ఈ చికిత్స వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ చికిత్సతో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
చికిత్సా విధానం
శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కణాలను కరిగించి, శరీరాకృతిని అందంగా తీర్చిదిద్దడానికి అలా్ట్రసౌండ్‌ తరంగాలను శరీరంలోకి పంపిస్తాము. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకునే నడుము, పిరుదులు, తొడలు, పొట్ట తదితర ప్రాంతాలలోనుంచి కొవ్వును కరిగించడం జరుగుతుంది. అలా్ట్రసౌండ్‌ ద్వారా శరీరంలోని కొవ్వు శాశ్వతంగా తొలగిపోతుంది. ఒకసారి తొలగించిన కొవ్వు కణాలు మళ్లీ ఏర్పడే అవకాశం లేదు. రక్త నాళాలు, నరాలకు సంబంధించిన కణజాలానికి ఎటువంటి హాని జరగకుండా అలా్ట్రసౌండ్‌ తరంగాల ద్వారా చర్మంలోపల ఉండే కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. ఒకసారి తొలగించిన కొవ్వు కణాలు మళ్లీ జీవం పోసుకోలేవు. దీని వల్ల ఇవి శాశ్వతంగా తొలగిపోయినట్లే. 
కరిగిన కొవ్వు ఏమవుతుంది?
అలా్ట్రసోనిక్‌ లైపోసక్షన్‌తో కరిగిన కొవ్వు లింఫాటిక్‌ సిస్టమ్‌ ద్వారా కాలేయంలో మెటబాలిజం జరిగి గ్లూకోజ్‌గా తయారవుతుంది. ఇలా తయారైన గ్లూకోజ్‌ నుంచి మనశరీరం మన రోజువారి పనులకు , వ్యాయామం కొరకు అవసరమైన శక్తిని వినియోగించుకోవడం జరుగుతుంది. ఒకవేళ మనం సరైన వ్యాయామం చేయకపోతే గ్లూకోజ్‌ కొవ్వులా మారి వివిధ శరీర భాగాల్లో పేరుకుపోవడం జరుగుతుంది. 
చికిత్సా కాలం ఎంత?
చికిత్సాకాలం 6 నుంచి 18 సెషన్లు ఉంటుంది. వారానికి రెండు సెషన్ల చొప్పున మూడు నుంచి 18 వారాలలో చికిత్స పూర్తవుతుంది. అయితే శరీరాకృతిని అందంగా మలచుకోవడం అన్నది రోగి చేతుల్లో కూడా ఉంటుంది. శరీరంలో నుంచి కొవ్వు తొలగిపోయిన తర్వాత రోగి బరువు తగ్గిపోతాడు. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలను చేయడం వంటి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకుంటే శరీరం అందంగా మారడం చాలా సులభం.
ప్రయోజనాలు
నాన్‌ సర్జికల్‌ లైపోసక్షన్‌ శరీరంపై ఎటువంటి గాట్లు లేకుండా, సర్జరీ లేకుండా, నొప్పి లేకుండా కొవ్వును కరిగించే చికిత్సా విధానం. నొప్పి ఉండదు. అనస్థీషియా అవసరం లేదు. మామూలుగా సర్జరీతో కూడిన లైపోసక్షన్‌ చేసుకున్న వారు సాధారణ స్థితికి రావడానికి వారం, పదిరోజులు పడుతుంది. కాని, నాన్‌ సర్జికల్‌ విధానంలో ఎటువంటి విశ్రాంతి అవసరం లేదు. వెంటనే తమ విధులకు హాజరుకావచ్చు. ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే ఆస్కారమే లేదు. శరీరంపైన దద్దుర్లు, చర్మం కందిపోవడం వంటివేవీ ఉండవు. చికిత్స కోసం ప్రతి సెషన్‌ 60 నుంచి 180 నిమిషాలపాటు ఉంటుంది. ఫలితాలు మొదటి సెషన్‌లోనే కనిపించినప్పటికీ 4 సెషన్లు పూర్తయ్యేసరికి చెప్పుకోదగ్గ శారీరక మార్పులు స్పష్టంగా కనపడతాయి. శరీరంలో ప్రతి భాగానికి కనీసం 6 నుంచి 18 సెషన్లు అవసరమవుతాయి. ఒకసారి కొవ్వు కణాలను తొలగించిన తర్వాత అవి మళ్లీ ఆ ప్రాంతంలో వచ్చే అవకాశాలు ఉండవు. చికిత్స చేసుకున్న తరువాత ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. 
 
డాక్టర్‌ జి. కిషోర్‌రెడ్డి
హెల్తీ కర్వ్‌ ్స స్లిమ్మింగ్‌ అండ్‌ కాస్మెటిక్‌ క్లినిక్‌
తిరుమలగిరి, సికింద్రాబాద్‌
రోడ్‌నెం 36, జూబ్లీహిల్స్‌
ఫోన్‌: 8978760606, 98858 66642