నాజూకైన నడుముకు

ఆంధ్రజ్యోతి(18-10-15): పొట్ట, నడుము భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంటుంది. ఇది స్త్రీలల్లో ఎక్కువగా కనిపించే సమస్య. అయితే ఈ కొవ్వును కరగడానికి కొన్ని రకాల డ్రింకులు ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. అవేమిటంటే...

గ్రీన్‌ టీ : ప్రతిరోజూ గ్రీన్‌ టీ తాగడం వల్ల నడుము నాజూకుగా తయారవుతుంది. గ్రీన్‌ టీలోని యాంటాక్సిడెంట్లు జీవక్రియా రేటుని పెంచడంలో  ఉపయోగపడతాయి.

పుచ్చకాయ జ్యూసు: పుచ్చకాయలో ఎక్కువశాతం నీరు ఉంటుంది. అతి తక్కువ కేలరీలు ఉండే ఈ జ్యూస్‌ తాగడం వల్ల పొట్టభాగంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. 

పుదీనా కోల్డ్‌ టీ: గ్యాస్‌ వల్ల కూడా పొట్ట లావుగా కనబడుతుంది. పుదీనా టీ తాగడం వల్ల గ్యాస్‌ తొలగిపోయి పొట్ట ప్లాట్‌గా అయిపోతుంది.

పైనాపిల్‌ జ్యూస్‌: పైనాపిల్‌ జ్యూస్‌ తాగడం వల్ల జీవక్రియా రేటు పెరిగి ఆహారపు అరుగుదల మెరుగుపడుతుంది. దాంతో కొంత బరువు తగ్గుతారు. అలాగే తక్కువ కేలరీలుండే చాక్లెట్‌ షేక్‌ తాగడం వల్ల కూడా అనవసరపు బరువు తగ్గుతారు.