నాజూకు నడుము కోసం

ఆంధ్రజ్యోతి(05/06/14): పొట ్టచుట్టూతా కొవ్వు పేరుకుపోవడం వల్ల శరీరాకృతి కూడా చూడ్డానికి బాగుండదు. అందుకే ఈ సమస్యతో బాధపడే వారు  స్లిమ్‌గా కనిపించడానికి  ఎంతో తాపత్రయపడుతుంటారు.  ఇలాంటి వాళ్లు కింద పేర్కొన్న టిప్స్‌  క్రమం తప్పకుండా పాటిస్తే పొట్ట ఫ్లాట్‌ అవుతుంది. బ్లోటింగ్‌ లాంటి సమస్యలు కూడా సులువుగా పరిష్కారమవుతాయి. అవేమిటంటే...

 పీచుపదార్థాలు బాగా తినాలి. అలా చేయడం వల్ల మలబద్ధకం సమస్య పోయి జీర్ణవ్యవస్థ సరిగా పనిచేస్తుంది. పళ్లు, కూరగాయలు, నట్స్‌, ధాన్యాలు వంటి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఫ్లూయిడ్స్‌ సైతం బాగా పుచ్చుకోవాలి. ముఖ్యంగా రోజుకు ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. 

ఫుడ్‌ ఎలర్జీస్‌ ఉన్నా కూడా పొట్ట మీద ప్రభావం చూపుతుంది. ఏదైనా ఆహారం పడడం లేదని మీకు  అనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టరును సంప్రదించాలి. 

ఆహారం నమలకుండా తొందర తొందరగా మింగేయడం వల్ల కూడా అది సరిగా జీర ్ణం కాదు. దీంతో కడుపంతా గాలితో నిండిపోయినట్టయి ఎత్తుగా కనిపిస్తుంది. తినే ఆహారాన్ని ఎంత బాగా నమిలితే అంతబాగా అది జీర్ణమయి శరీరానికి ఒంటబడుతుంది. అందుకే భోజనానికి   అరగంట సమయం తప్పనిసరిగా కేటాయించాలి. అన్నం బాగా నమిలి తినాలి. ఇలా అన్నం బాగా నమిలి తినడం వల్ల ఎక్కువ అన్నం కూడా తినలేము.

కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌ ఎక్కువ తాగడం వల్ల కూడా కడుపంతా గ్యాస్‌తో నిండి ఎత్తుగా కనిపిస్తుంది. వీటికి బదులు నిమ్మకాయ నీళ్లల్లాంటివి తాగితే శరీరానికి  చాలా మంచిది. కడుపు బరువుగా ఉందనిపిస్తే పిప్పరమెంట్‌ లేదా లెమన్‌ టీ లాంటివి తీసుకుంటే తేలిగ్గా ఉంటుంది. 

కొంతమందికి ఎక్కువసేపు చూయింగ్‌ గమ్‌ నమిలే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల కడుపంతా గాలితో నిండిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాటికి దూరంగా ఉంటే మంచిది. చూయింగ్‌ గమ్‌కు బదులుగా పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే పళ్లు , కూరగాయలు, తక్కువ ఫ్యాట్‌ ఉండే పాప్‌కార్న్‌లాంటివి స్నాక్స్‌గా తీసుకోవాలి. 

చక్కెర పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మంచిది కాదు. వాటివల్ల కూడా శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. షుగర్‌ ఫ్రీ ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల పొట్ట తేలిగ్గా ఉంటుంది.  

తినే పదార్థాల్లో సోడియం తక్కువ ఉండేట్టు జాగ్రత్తపడాలి. సాధారణంగా ప్రోసెస్‌డు ఫుడ్‌లో సోడియం ఎక్కువ ఉంటుంది.  ప్రోసెస్డ్‌ ఫుడ్‌ లేదా ఫ్రోజెన్‌ ఫుడ్‌ కొనుక్కునేటప్పుడు సోడియం ఎక్కువ ఉండకుండా (అంటే రోజుకు 1500 ఎంజి నుంచి 2,300 ఎంజి మించి తీసుకోరాదు ) చూసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి ఫుడ్స్‌ కొనుక్కునేటప్పుడు ఆ ఉత్పత్తులపై ఉన్న లేబుల్స్‌ను తప్పనిసరిగా చదవాలి. అందులో ‘తక్కువ సోడియం’, ‘సోడియం ఫ్రీ’ లేదా చాలా ‘తక్కువ సోడియం’ అని రాసి ఉందో లేదో గమనించుకోవాలి.

 బీన్స్‌ లాంటివి తినడం అలవాటు లేనివారు ఒక్కసారే వాటిని తినే ప్రయత్నం చేయొద్దు.  గ్యాస్‌ సమస్య వస్తుంది. అందుకే వీటిని కొద్ది కొద్దిగా తినాలి.

చిన్న చిన్న మొత్తాల్లో ఆహారం ఎక్కువసార్లు తినాలి. అంటే రోజుకు ఐదు లేద ఆరు సార్లు కొద్ది కొద్దిగా ఆహారం తినాలి. తినే పదార్థాల్లో ప్రొటీన్లు, విటమిన్లు బాగా ఉండేలాగ  చూసుకోవాలి. 

గ్యాసు సమస్య రాకుండా పిప్టర్‌మెంట్‌, అల్లం టీ, పైనాపిల్‌, పెరుగు వంటి ప్రొబయోటిక్స్‌ ఉన్న తీసుకోవాలి.

ఇవన్నీ సరిగ్గా పాటిస్తే మీ పొట్ట ఫ్లాట్‌గా ఉండడమే కాదు శరీరం కూడా ఎప్పుడూ ఎంతో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటుంది.