ఎరోబిక్స్‌తో మెదడుకు మేలు

05-09-2019: ఎరోబిక్‌ వ్యాయామాల వల్ల క్యాలరీలు కరుగుతాయి. కండరాలు బలోపేతం అవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇవన్నీ అందరికీ తెలిసినవే. అయితే ఎరోబిక్‌ వ్యాయామాలతో మెదడు ఆరోగ్యం కూడా మెరుగవుతుందని ఇటీవలి అధ్యయనంలో వెల్లడయింది. ప్రతి వారం కనీసం 150 నిమిషాల పాటు ఎరోబిక్‌ వ్యాయామాలు చేస్తే ఆరోగ్యంపై పాజిటివ్‌ ఇంపాక్ట్‌ ఉంటుంది. శరీరంలో రక్తసరఫరా మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు వంటి సమస్యలు దరిచేరవు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతే కాకుండా న్యూరోట్రోఫిన్స్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. డిప్రెషన్‌, ఒత్తిడి, డిమెన్షియా వంటి సమస్యలు ఎరోబిక్‌ వ్యాయామాల వల్ల దరిచేరకుండా ఉంటాయి. బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.