ఎక్సర్‌సైజ్‌కు ముందు..

01-05-2019: ఎక్సర్‌సైజ్‌ ముందూ తర్వాతా వామప్‌ చేయడం ద్వారా శరీరం ఒత్తిడికి లోనవదు. మీరు ఎంత సమయం వర్కవుట్స్‌ చేస్తారనేది వామప్‌ మీద ఆధారపడి ఉంటుందంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణురాలు దినాజ్‌. వామప్‌లో భాగంగా సులువుగా, సౌకర్యంగా ఉండే బ్యాక్‌ స్ర్టెచ్‌, తొడ భాగం ముందుకు వంచడం వంటివి చేయాలి. పరిగెత్తడానికి ముందు జాగింగ్‌, సైక్లింగ్‌ వంటివి వామప్‌గా ఉపయోగపడతాయి.
 
వార్మప్‌ వల్ల ఒనగూరే లాభాలివి..
 
ఎక్సర్‌సైజ్స్‌ చేసేందుకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. వామప్‌ వల్ల
కండరాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. కండరాల్లో వేడి పుడుతుంది. దాంతో మరింత ఉత్సాహంగా ఎక్సర్‌సైజ్‌లు చేస్తారు.
వామప్‌ చేయడం వల్ల శరీరం వేడెక్కుతుంది. దాంతో ఎక్సర్‌సైజ్‌ సమయంలో క్యాలరీలను కరిగించడం తేలికవుతుంది.
కండరాల సంకోచం, వ్యాకోచం సులువవుతుంది. దాంతో ఏ ఇబ్బంది లేకుండా కండరాలను కదిలించవచ్చు. ఫలితంగా గాయాల బారిన పడడం, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు ఎదురవవు.
శరీర భాగాలకు ఆక్సిజన్‌ సరఫరా వేగంగా జరుగుతుంది. దాంతో జీవక్రియ రేటు పెరుగుతుంది.
రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు, ఆఫీ్‌సలో ఎక్కువ సమయం ఉత్సాహంగా పనిచేసేందుకు వామప్‌ తోడ్పడుతుంది.