జిమ్‌కి వెళ్తున్నారా?

23-08-2019: జిమ్‌కు వెళ్లే అలవాటు మంచిదే! అయితే జిమ్‌లో వ్యాయామాలు చేయబోయేముందు, అనుసరించాల్సిన నియమాలు, పద్ధతుల గురించి తెలుసుకోవాలి. అవేంటంటే....
 
దుస్తులు: వ్యాయామాలు చేయడానికి శరీరం సహకరించాలంటే, అందుకు అనువైన దుస్తులు ఎంచుకోవాలి. చెమటను పీల్చుకునే, సాగే గుణం కలిగిన దుస్తులు ధరించాలి. కేవలం వ్యాయామాల కోసం ఉద్దేశించిన దుస్తులనే కొనుగోలు చేయాలి.
 
రుమాలు: వ్యాయామాలు చేసే సమయంలో ఎక్కువగా స్వేదం విడుదలవడం సహజం. ఎప్పటికప్పుడు తుడుచుకోవడానికి వెంట కాటన్‌ రుమాలు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
 
షూస్‌: పాదం అడుగున వంపునకు ఆసరా అందించే షూస్‌ ఎంచుకుంటే పాదాల మీద ఒత్తిడి తగ్గుతుంది. చెమట పీల్చుకునే సాక్స్‌, చక్కని గ్రిప్‌ కలిగిన షూస్‌ ఎంచుకోవాలి. నాణ్యత విషయంలో రాజీ పడకూడదు.
 
వాటర్‌ బాటిల్‌: జిమ్‌లో నీటి సౌలభ్యం ఉన్నా వెంట నీళ్ల బాటిల్‌ తీసుకువెళ్తే ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే వీలు ఉండదు.