కళ్ల అలసట మాయం!

 

ఆంధ్రజ్యోతి (26-11-2019): శారీరక శ్రమ తగ్గి, మేధో శ్రమ పెరిగిపోతున్న కాలమిది. అయితే, మేధోశ్రమలో మరీ ఎక్కువగా అలసిపోయేవి కళ్లు! ఎక్కువగా చదవడం, ఎక్కువ గంటలు టీ.వీ, సినిమాలు చూడటం, రాత్రివేళల్లో తక్కువ కాంతిలో చదవడం, గంటల కొద్దీ కంప్యూటర్‌తో పనిచేయడం వంటి పనుల వల్ల కళ్లు నీరసించిపోతాయి. ఎప్పటికప్పుడు వాటిని ఉత్తేజితం చేసుకోకపోతే, పోటీ ప్రపంచంలో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. అలసట పోయి కళ్లు హుషారుగా పనియేయడానికి ఈ క్రింది హోమియో మందులు బాగా ఉపయోగపడతాయి.
 
కళ్లకు శ్రమ మరీ ఎక్కువై వాలిపోతున్నప్పుడు రూటా-30 మందు వేసుకోవాలి.
 
కళ్ల అలసటతో పాటు, నొప్పులు, తలదిమ్ము, గుడ్లు లాగేయడం ఉంటే, నేట్రంమూర్‌ - 30 మందు బాగా పనిచేస్తుంది.
 
చూపు మసకగా ఉండి, చదవడం, రాయడం కష్టంగా అనిపించినప్పుడు అంబ్రగ్రీసియా-30 మందు వేసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
 
వృద్ధుల్లో శుక్లాలు మొదలై, చూపు మసకగా మారితే... కోనియం-200 మందు వేసుకోవడం ద్వారా స్పష్టమైన చూపును పొందవచ్చు.
 
చదువుతున్నప్పుడు అక్షరాలన్నీ అలుక్కుపోయి కనిపిస్తున్నప్పుడు కాకులస్‌-30 మందు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
 
అలసటతో పాటు కళ్లు లాగడం, తలదిమ్ముగా ఉండి, ఏ పనీ చేయలేకపోవడం, కళ్లల్లోంచి నిరంతరంగా నీళ్లు కారుతూ ఉంటే యూఫ్రేసియా- 30 మందు బాగా పనిచేస్తుంది.
 
- డాక్టర్‌ బి. అనిల్‌ కుమార్‌
హోమియో వైద్య నిపుణులు