కళ్లు చెబుతున్నాయి!

19-06-2018: రేచీకటి ఉన్న వ్యక్తులు కామోఫ్లాజ్‌ (పరిసరాల్లో కలిసిపోయి, మభ్యపెట్టడం)ను పసిగట్టగలుగుతారు. కాబట్టి అలాంటి సైనికుల్ని రెండవ ప్రపంచయుద్ధంలో ఉపయోగించుకున్నారు.
మానవ నేత్రం 500 రకాల నలుపు రంగుల్ని గుర్తించగలదు. 10 మిలియన్ల వేర్వేరు రంగుల్ని కనిపెట్టగలదు.
పసికందులకు 3 నెలలొచ్చేవరకూ ఎంత ఏడ్చినా కన్నీళ్లు కారవు.
కంట్లోని కండరాలు కంటికి సంబంధించినంతవరకూ మిగతా శరీరంలోని అవయవాలన్నింటి కంటే దృఢమైనవి.
పరిస్థితులు అనుకూలంగా ఉంటే మానవ నేత్రం 14 మైళ్ల దూరంలో ఉన్న క్యాండిల్‌ వెలుగును కూడా గుర్తించగలదు.