నేత్ర వైద్యం ఇప్పుడు ఎంతో నవీనం

ఆంధ్రజ్యోతి, 23-06-2015:వివిధ కార్య విభాగాలతో ఉండే మానవ నేత్ర నిర్మాణం చాలా సంకీర్ణమైనది. జీవితంలోని పలు పరిణామాల వల్ల కంటి లోని కొన్ని విభాగాలు దె బ్బ తినవచ్చు లేదా క్షీణించిపోవచ్చు. కంటి మీద పడే శ్రమ గానీ, ఒత్తిడి గానీ, ఏదైనా వ్యాధి వల్ల గానీ లేదా వయసు పైబడటం వల్లగానీ కంటికి ఈ నష్టాలు జరిగిపోవచ్చు. అయితే, వైద్మ రంగంలో ఇటీవలి కాలంలో వస్తున్న పురోగతి కంటి వ్యాధులు, ఇంకా ఇతర సమస్యల విషయంలో చేసే వైద్య చికిత్సల రూపురేఖల్ని సమూలంగా మార్చివేసింది.
 
క్యాటరాక్ట్‌ : ఈ సమస్యలో కంట్లోని లెన్స్‌ మీద పొర ఏర్పడి దృష్టిలోపం ఏర్పడుతుంది. దీని వల్ల ఎదురుగా వచ్చే హెడ్‌లైట్ల కిరణాలు కంటి మీద పడి రాత్రివేళ డ్రైవింగ్‌ చేయడం సమస్య అవుతుంది. ఒకప్పుడు ఫాకోమల్సిఫైర్‌ అనే సాధనం ద్వారా ఈ సమస్యకు చికిత్స చేసేవారు. ఈ అల్ట్రాసౌండ్‌ విధానంతో మందంగా ఉన్న క్యాటరాక్ట్‌ పొర ను తొలగిస్తున్నప్పుడు ఎక్కువ ఉష్ణం ఉత్పత్తి అయి కంటిలోని కార్నియా కొంత దెబ్బ తినేది. ఫలితంగా రోగి కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టేది. కొత్తగా వచ్చిన కాటాలిస్‌ ఫెమ్టో విధానం పూర్తిగా భిన్నమైనది. కంటిలోకి వెళ్లకుండానే కంటి పొరను తొలగించే ఈ విధానం నిజమైన లేజర్‌ సిస్టమ్‌. కేవలం 35 సెకన్లలోనే ఇది క్యాటరాక్ట్‌ పొరను తొలగించగలుగుతుంది. కాకపోతే పాత విధనాల్లోలాగే కంటి దగ్గర చిన్న కోత పడుతుంది.
 
ఒకప్పుడు క్యాటరాక్ట్‌ను తొలగించగానే కళ్లలో లెన్స్‌లు బిగించేవారు. ఆ తర్వాత కళ్లజోడు కూడా పెట్టుకోవాల్సి వచ్చేది. అయితే, స్విమ్మర్స్‌, అథ్లెట్స్‌ల లాంటి చురుకైన పనులు చేసేవారికి ఈ గ్లాసులతో కొంత అససౌకర్యంగానూ, ఇబ్బందిగానూ ఉండేది. అందుకు భిన్నంగా ఇప్పుడు వచ్చిన ట్రిఫోకల్‌ లెన్స్‌లు బిగించాక మళ్లీ కళ్లజోడు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు.
 
గ్లకోమా : కంటి మీద ఒత్తిడి పెరగడం వల్ల తాత్కాలికంగా గానీ, శాశ్వతంగా గానీ ఆప్టిక్‌ నరం దెబ్బతిని చూపుకోల్పోయే సమస్యనే గ్లకోమా అంటారు. ఓసిటి (ఆప్టికల్‌ కోహెరెన్స్‌ టోమోగ్రఫీ) యంత్రం ద్వారా గ్లకోమాను ముందే గుర్తించి విజయవంతంగా నయం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కెనలోప్లాస్టీ అనే ఒక కొత్త విఽధానమొకటి అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా కంటిలో ఏ కోత పెట్టకుండానే చికిత్స చేయడం సాధ్యమవుతోంది. 
40 తర్వాత.... : ఇటీవలి కాలంలో 40 ఏళ్లు వస్తే చాలు చాలా మందికి ఏం చదవాలన్నా రీడింగ్‌ గ్లాసులు అవసరమవుతున్నాయి. కానీ, ట్రిఫోకల్‌ లెన్స్‌లు బిగించే విధానంతో దూరపు, దగ్గర చూపు సమస్యలు రెండూ ఏక కాలంలో తొలగిపోతున్నాయి. 16 ఏళ్ల క్రితం మల్టీవ్యూ అనే ఒక విధానం ఉండేది. దాన్ని వృద్ధి చేసి ఈ ట్రిఫోకల్‌ లెన్స్‌గా రూపాంతరం చేశారు. దీని వల్ల ఏ చిన్న దుష్ప్రభావమూ లేకపోగా, రాత్రివేళ నిశ్చింతగా డ్రైవింగ్‌ చే సే అవకాశాలు ఉన్నాయి.