ఆ ఎంజైమ్‌తో కన్నుకు క్షతి

వాషింగ్టన్‌, నవంబరు 28: ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్ని ఇంద్రియాల్లోకెల్లా కళ్లు ముఖ్యమైనవి. అయితే, ప్రపంచవ్యాప్తంగా 20కోట్ల మంది దృష్టిలోపంతో బాధపడుతున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ సమస్యకు గల కారణాలేంటని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి దృష్టిలోపాన్ని కలిగించే ఎంజైమ్‌ను గుర్తించారు. ‘సీగ్యాస్‌’ అనే పేరున్న ఈ ఎంజైమ్‌ కళ్లకు మంటను కలిగించి కణాలను దెబ్బతీస్తాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన భారత సంతతి శాస్త్రవేత్త జయకృష్ణ అంబటి తెలిపారు. కొత్తగా కనుగొన్న ఈ ఎంజైమ్‌ పనితీరును తగ్గించేలా చేసి దృష్టిలోపానికి అడ్డుకట్ట వేసేలా చికిత్సలు రూపొందించవచ్చని ఆయన వెల్లడించారు.