కళ్ల కింద వలయాలా...?

21-08-2018: కళ్ల కింది నల్లటి వలయాలు ముఖ సౌందర్యానికి ఇబ్బంది కలిగిస్తాయి. వాటిని ఎలా తొలగించాలంటే...
టొమాటో, యోగర్ట్‌: కప్పు టొమాటో గుజ్జులో టీ స్పూను యోగర్ట్‌ వేసి కలపాలి. ఈ పేస్టును నల్లటి వలయాల మీద రాసి, 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే ఫలితం ఉంటుంది. టొమాటోలో ఉండే లైకోపిన్‌ చర్మం మీది జిడ్డును తొలగిస్తుంది. యోగర్ట్‌లోని లాక్టిక్‌ ఆమ్లం నల్లటి వలయాలను మటుమాయం చేస్తుంది.
కీరదోస, కలబంద: ఇవి చర్మం డిహైడ్రేషన్‌కు లోనవకుండా చూస్తాయి. చర్మాన్ని చల్లగా ఉంచుతాయి కూడా. కీరదోస ముక్కలలో టేబుల్‌ స్పూను కలబంద గుజ్జు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల కింద రుద్ది, 20 నిమిషాల తర్వాత కడిగితే చర్మం మెరుస్తుంది.